Thousands of migratory birds die mysteriously in Rajasthan’s Sambhar Lake (Photo-ANI)

Jaipur, November 12: ఎడారి రాష్ట్రం రాజస్థాన్‌(Rajasthan)లో వలస పక్షుల (Migratory Birds) మృత్యు ఘోష వినిపిస్తోంది. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రముఖ ఉప్పు నీటి సరస్సు అయిన సాంబార్ సరస్సులో వేలకొద్దీ వలస పక్షులు(Mysterious Death Of Migratory Birds) చనిపోయాయి. ఇది దేశంలోనే అతి పెద్ద ఉప్పునీటి సరస్సు( largest inland saltwater lake). ఈ సరస్సుకు వేలాది వలస పక్షులు ప్రతి సంవత్సరం వస్తుంటాయి.

అలాగే ఈ సంవత్సరం కూడా సాంబార్ సరస్సు(Sambhar Lake)కు వేలాది పక్షులు (Thousands of migratory birds)విదేశాల నుంచి వలస వచ్చాయి. ప్రతి సంవత్సరం సుమారు 2-3 లక్షల వలస పక్షులు ఈ సరస్సుకు వస్తుంటాయి.ఈ ఏడాది వలస వచ్చిన ఈ పక్షులు ఉన్నట్టుండి భారీ సంఖ్యలో మరణించాయి.

10 రకాల జాతులకు చెందిన దాదాపు 5వేల పక్షులు మరణించాయి.అయితే అధికారికంగా వీటి సంఖ్యను 1500 అని తేల్చారు. గత వారం రోజుల నుంచి జరుగుతున్న పక్షుల మరణాలు ఆందోళనకలిగిస్తున్నాయి. చనిపోయిన పక్షుల కళేబరాలు సరస్సు పరిసర ప్రాంతాల్లో చెల్లా చెదురుగా పడి ఉన్నాయి.

వలస పక్షుల మృత్యు ఘోష

సరస్సు యొక్క పరీవాహక ప్రాంతం వద్ద ప్లోవర్లు, కామన్ కూట్, బ్లాక్ రెక్కల స్టిల్ట్, నార్తర్న్ షోవెలర్స్, రడ్డీ షెల్డక్ మరియు పైడ్ అవోసెట్లతో సహా వందలాది చనిపోయిన పక్షుల మృతదేహాలు చెల్లాచెదురుగా ఉన్నాయి. సాంబార్‌ సరస్సులో వైరల్‌ సోకి వలస వచ్చిన విదేశీ పక్షులు మృత్యువాత పడ్డాని అధికారులు చెబుతున్నారు.

నీటి కాలుష్యం మరణాలకు ఒక కారణమని వారు తెలిపారు.దీనిపై సమాచారం అందుకున్న స్థానిక పంచాయతీ అధికారులు, వన్యప్రాణి సంక్షేమ శాఖ అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని మరణించిన వలస పక్షులను పరిశీలించారు. అనంతరం వాటి శాంపిళ్లను సేకరించి పరీక్షకు పంపించారు.

ఈ విషయంపై అటవీశాఖ రేంజర్ రాజేంద్ర జఖర్ మాట్లాడుతూ కొద్ది రోజుల క్రితం ఈ ప్రాంతంలో వడగళ్ళు కురిసాయి. ఒకవేళ ఆ ప్రభావంతో గానీ లేక వైరస్ వల్ల గానీ పక్షులు చనిపోయి ఉండవచ్చని అటవీ రేంజర్ రాంజేద్ర జఖర్ అభిప్రాయపడ్డారు. “సుమారు 10 జాతుల 1,500 పక్షులు చనిపోయాయని మేము అంచనా వేస్తున్నాము. నీరు విషపూరితం కావడం, బ్యాక్టీరియా లేదా వైరల్ ఇన్ఫెక్షన్ వంటి ఇతర అవకాశాలను కూడా మేము పరిశీలిస్తున్నాము” అని ఆయన చెప్పారు. జైపూర్‌కు చెందిన ఒక వైద్య బృందం కొన్ని మృతదేహాలను సేకరించి, నీటి నమూనాలను తదుపరి పరీక్ష కోసం భోపాల్‌కు పంపింది.