Telangana Police Alert New UPI fraud trend, aware of UPI Fraudsters

UPI Charges: తెల్లారితే పాల ప్యాకెట్ కొనుగోలు చేయడం మొదలుకొని రాత్రి డిన్నర్ వరకూ ఒక్క రూపాయి నుంచి లక్షల రూపాయల వరకు నిత్యం గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం, భీమ్ వంటి యాప్స్ ద్వారా ఉచితంగా సాగిస్తున్న యూపీఐ (UPI) లావాదేవీలపై ఇకపై రుసుముల భారం పడనుంది. ఇన్నాళ్లూ డిజిటల్ పేమెంట్లను ప్రోత్సహిస్తూ ఉచితంగా సేవలు అందించిన ప్రభుత్వం.. తాజాగా యూపీఐ, రూపే డెబిట్ కార్డు లావాదేవీలపై ‘మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR)’ వసూలు చేసుకునేందుకు బ్యాంకులకు, పేమెంట్ సిస్టమ్ ప్రొవైడర్లకు (PSP) అనుమతినిస్తూ రూపొందించిన బిల్లుకు లోక్‌సభలో ఆమోదం లభించింది.

మర్చంట్ డిస్కౌంట్ రేట్ అంటే వ్యాపారుల వద్ద కస్టమర్లు చేసే డిజిటల్ చెల్లింపులను ప్రాసెస్ చేసినందుకు గాను బ్యాంకులు, సర్వీస్ ప్రొవైడర్లు వ్యాపారుల నుంచి వసూలు చేసే రుసుము. ఇప్పటివరకు ఉనికిలో ఉన్న ‘జీరో ఎండీఆర్’ పాలసీ రద్దు కానుండటంతో.. రాబోయే రోజుల్లో రూ. 2 వేల కంటే ఎక్కువ విలువైన లావాదేవీలపై 0.3 శాతం నుంచి 0.5 శాతం వరకు ఎండీఆర్ విధించే అవకాశం ఉందని సమాచారం.

రెపో రేటుపై RBI కీలక ప్రకటన.. లోన్ తీసుకున్నవారికి గుడ్ న్యూస్.. తటస్థ వైఖరి కొనసాగించడమే సరైన నిర్ణయమని తెలిపిన ఆర్బీఐ గవర్నర్..

ఈ చార్జీలు వ్యాపారులపైనే వేస్తున్నామని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నప్పటికీ.. వ్యాపారులు తమకు తగ్గే ఆ మొత్తాన్ని వస్తువు ధరలు పెంచడం ద్వారా లేదా ప్రాసెసింగ్ ఫీజు పేరిట కస్టమర్ల నుంచే రాబడతారని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఉదాహరణకు, కస్టమర్ రూ. 2 వేలు చెల్లిస్తే.. ఎండీఆర్ మినహాయించుకుని వ్యాపారి ఖాతాలో తక్కువ జమ అవుతుంది. దాంతో సదరు నష్టాన్ని పూడ్చుకోవడానికి వ్యాపారులు ఆ భారాన్ని కొనుగోలుదారులపైనే వేసే ప్రమాదం ఉంది.

ఈ విషయమై ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా స్పందిస్తూ.. డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ నిర్వహణకు ఖర్చులు ఉంటాయని.. ఆ వ్యయాన్ని ఎవరో ఒకరు భరించాల్సిందేనని పేర్కొన్నారు. అయితే ఆ భారం నేరుగా వినియోగదారులపైనే పడుతుందని చెప్పలేమని, పరోక్షంగా ఆర్థిక వ్యవస్థలోనే ఆ వ్యయం భరించే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు.

మరోవైపు, ప్రతిపక్షాలు ఈ బిల్లును ఎలాంటి చర్చ లేకుండా ఆమోదించడంపై మండిపడుతున్నాయి. గత నెలలోనే దాదాపు రూ. 29.88 లక్షల కోట్ల విలువైన యూపీఐ లావాదేవీలు నమోదయ్యాయి (గత ఏడాదితో పోలిస్తే 19% పెరుగుదల). ఈ కొత్త చార్జీల నిర్ణయం వల్ల డిజిటల్ లావాదేవీలు తగ్గడమే కాకుండా, వ్యాపారులు ఆన్‌లైన్ పేమెంట్లను నిరాకరించి మళ్లీ నగదు (Cash) లావాదేవీల వైపు మళ్లే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.