Etawah, Feb 25: తలపై వెంట్రుకలు లేవని పీటలపై పెళ్లి ఆపింది ఓ యువతి. పెళ్లి ముహుర్తం దగ్గర పడ్డ తర్వాత పెళ్లికుమారుడ్ని చూసి.....షాకై కళ్లు తిరిగిపడిపోయింది ఆ యువతి. ఉత్తరప్రదేశ్ లోని (Uttar Pradesh) ఇట్వా జిల్లా భర్తానాలో ఈ ఘటన జరిగింది. ఆ గ్రామానికి చెందిన యువతితో అజయ్ అనే యువకుడితో పెళ్లి ఫిక్సయింది. పెద్దలంతా కూర్చొని ఓ ముహుర్తం అనుకున్నారు. పెళ్లికోసం ఘనంగా ఏర్పాట్లు చేశారు. పెళ్లి తంతు కూడా మొదలైంది. పెళ్లి కొడుకు(Groom), పెళ్లి కూతురు పీటల మీద కూడా కూర్చున్నారు. ఇక దండలు మార్చుకునే టైంలో పెళ్లి కొడుకు పదే పదే తన తలపాగాను సర్ధుకుంటున్నాడు. దీంతో ఆ యువతికి అనుమానం వచ్చింది.
అంతలోపే అక్కడే ఉన్న ఓ వ్యక్తి...అజయ్ ది బట్టతల (Bald Head)అని, అతను విగ్ (Wig)పెట్టుకొని కవర్ చేస్తున్నాడని, పెళ్లికూతురు చెవిన వేశాడు. దీంతో సరిగ్గా గమనించిన యువతి, అది నిజంగా విగ్గే అని తేల్చుకుంది. ఒక్కసారిగా కళ్లుతిరిగి కింద పడిపోయింది. కాసేపటికి సృహలోకి వచ్చిన యువతి...తనకు ఈ పెళ్లి వద్దంటూ ఖరాఖండిగా తేల్చేసింది. దీంతో చాలామంది ఆమెకు సర్ధిచెప్పేందుకు ప్రయత్నించారు. కానీ ఆమె వినలేదు.
దీంతో చేసేదేమీ లేక అక్కడి నుంచి ఇంటికి వెళ్లిపోయారు పెళ్లికొడుకు తరుపువారు. గతంలో కూడా ఇలాంటి ఘటనలు జరిగాయి. అయినా పెళ్లి చూపులు, మిగిలిన కార్యక్రమాల్లో చూసుకోకూడదా? అంటూ పలువురు ఆమెను వారించారు. అయినప్పటికీ ఆమె మాత్రం పెళ్లికి ససేమీరా అంటోంది.