Newdelhi, Feb 1: రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) కాసేపటి క్రితం కలిశారు. మరికాసేపట్లో ఆమె లోక్ సభలో కేంద్ర బడ్జెట్ (Union Budget 2025) ప్రవేశపెట్టనున్నారు. ఇది ఆమెకు వరుసగా ఎనిమిదవ బడ్జెట్. డిజిటల్ టాబ్లెట్ ద్వారా నిర్మల బడ్జెట్ ప్రసంగం చేయనున్నారు. కాగా మధుబని ఆర్ట్ కు ప్రాచుర్యం తీసుకురావడంలో భాగంగా పద్మశ్రీ అవార్డు గ్రహీత దులారి దేవి ఇచ్చిన చీరను నిర్మల కట్టుకొన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ మందగించి, వినియోగం తగ్గుతున్న సమయంలో, ధరలు అంతకంతకూ పెరిగిపోతున్న తరుణంలో, రూపాయి పతనం, పసిడి పరుగులు కొనసాగుతున్న నేపథ్యంలో నేటి బడ్జెట్ ను అటు ఆర్ధిక నిపుణులు, సామాన్యులు నిశితంగా పరిశీలిస్తున్నారు. గత బడ్జెట్ 2024-25లో నిర్మలా సీతారామన్ 'వికసిత్ భారత్' కోసం రోడ్ మ్యాప్ ను రూపొందించారు. ఈ క్రమంలో ఉదయం 11 గంటలకు ప్రవేశపెట్టనున్న ఈ సారి బడ్జెట్ ఎలా ఉండబోతున్నదన్న విషయంపై అన్ని వర్గాల్లో ఆసక్తి నెలకొన్నది.
రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
మరికాసేపట్లో బహీ ఖాతా డిజిటల్ బడ్జెట్ టాబ్లెట్ ను పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న నిర్మలా సీతారామన్ pic.twitter.com/aICVOePUN7
— BIG TV Breaking News (@bigtvtelugu) February 1, 2025
Budget LIVE:
పూర్తి స్థాయి బడ్జెట్ ఇదే
ఎన్డీయే ప్రభుత్వం మూడోసారి ఏర్పడ్డాక వస్తున్న పూర్తి స్థాయి బడ్జెట్ కావడంతో.. దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి. పైగా ఈ బడ్జెట్ కి ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దీని గురించి మాట్లాడుతూ.. మహాలక్ష్మి మంత్రాన్ని జపించడంతో అంచనాలు మరింత పెరిగాయి. పేద, మధ్య తరగతి వారు తమకు కొత్త పథకాలు తెస్తారని ఆశగా ఎదురుచూస్తున్నారు. అలాగే వేతన జీవులు.. పన్ను మినహాయింపులు పెంచుతారని ఎదురుచూస్తున్నారు. గత మధ్యంతర బడ్జెట్ సమయంలో పన్ను చెల్లింపుదారులకు కొత్త పన్ను విధానంలో స్టాండర్డ్ డిడక్షన్ రూ. 50 వేల నుంచి రూ. 75 వేలకు పెంచిన కేంద్రం.. ఈసారి కూడా మరింత పెంచుతుందని అంచనాలు ఉన్నాయి. ఇంకా టాక్స్ రిబేట్ కూడా పెంచి మధ్యతరగతి, వేతన జీవులకు భారీ ఊరట కలిగిస్తుందని అంచనా వేస్తున్నారు.