YS Sharmila mass counter to YCP MP Vijay Sai Reddy(X)

Hyd, Oct 27: వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు వైఎస్ షర్మిల. ఈ మేరకు ఎక్స్‌లో ట్వీట్ చేసిన షర్మిల...సాయిరెడ్డి చదివింది జగన్ మోహన్ రెడ్డి గారి స్క్రిప్ట్ కాదని ప్రమాణం చేయగలరా ? ఆస్తుల గురించి నలుగురు చిన్న బిడ్డలకు సమాన వాటా ఉంటుందన్న YSR మ్యాండేట్ .. అబద్ధం అని మీ బిడ్డల మీద ప్రమాణం చేయగలరా ? అని ప్రశ్నించారు.

మీరు కూడా జగన్ మోహన్ రెడ్డి మోచేతి నీళ్ళు తాగిన వాళ్ళే...రాజకీయంగా,ఆర్థికంగా జగన్ గారి వల్ల బలపడిన వాళ్ళే. మీరు ఇలా కాకపోతే ఎలా మాట్లాడుతారులే అని ఎద్దేవా చేశారు.

YSR మరణానికి కాంగ్రెస్ ముమ్మాటికీ కారణం కాదు. రెండు సార్లు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చింది YSR . బంగారు బాతును ఎవరు చంపుకోరు. సొంత కళ్లను ఎవరు పొడుచుకోరు అని తెలిపారు. వైఎస్‌ఆర్ మరణానికి చంద్రబాబు గారు కారణం అయితే మీరు అధికారంలో ఉండి 5 ఏళ్లు గాడిదలు కాశారా ? ప్రత్యేక విచారణ ఎందుకు జరిపించలేదు ? దర్యాప్తు చేసి నిజానిజాలు ఎందుకు బయట పెట్టలేదు ? దోషులను ఎందుకు శిక్షించలేదు ? అనుమానం ఉండి, 5 ఏళ్లు అధికారంలో ఉండి, ఎందుకు ఒక్క ఎంక్వైరీ కూడా వెయ్యలేదు ? ఇది మీ చేతకానితనానికి నిదర్శనం కాదా ? అని ప్రశ్నించారు.

YSR మరణం తర్వాత చార్జిషీట్ లో ఆయన పేరు చేర్పించింది మీ నాయకుడు జగన్ మోహన్ రెడ్డి గారు కాదా ? కేసుల నుంచి బయట పడటానికి పొన్నవోలుతో కలిసి ఈ కుట్ర చేయలేదా ? చేయకపోతే జగన్ గారు సీఎం అయిన వెంటనే, మొదటగా అడ్వకేట్ జనరల్ పదవి ఎందుకు ఇచ్చారు ? ఇప్పుడు మళ్ళీ తన స్వప్రయోజనం కోసం తల్లిని కోర్టుకి ఈడ్చిన విషపు నాగు జగన్ గారు కాదా ? చెప్పాలన్నారు.

Here's Sharmila Tweet:

 చంద్రబాబుతో నాకు ఎటువంటి వ్యక్తిగత సంబంధాలు లేవు. YSR తన బిడ్డ పెళ్లికి చంద్రబాబు గారిని పిలిచారు. అలాగే నేను కూడా పిలిచాను. ప్రతిపక్ష నేతను పెళ్లికి ఆహ్వానిస్తే.. నా చీర గురించి కూడా విపరీత అర్థాలు తీసే మీలాంటి వాళ్ళకు సభ్యతా సంస్కారం ఉందని ఎలా అనుకోవాలి ? అని ప్రశ్నించారు.

జగన్ కి ఇంకా చంద్రబాబు పిచ్చి వీడలేదా ? ఇప్పటికీ అద్దంలో చూసుకున్నా.. చంద్రబాబే కనిపిస్తున్నట్లుంది. చంద్రబాబు గారి కళ్ళల్లో ఆనందం చూడటానికో.. ఆయన బ్రాండింగ్ ను ఫాలో అవ్వడానికో.. ఆయన్ను ఇంప్రెస్ చేయడానికో.. పని చేయాల్సిన అవసరం YSR బిడ్డకు ఎన్నటికీ రాదని మాట ఇస్తున్నా అని స్పష్టం చేశారు.