astrology

గ్రహాలకు రాజు అయిన సూర్యుడు తన రాశిని మార్చుకుంటున్నాడు. సెప్టెంబర్ 20న సూర్యుడు ,కేతు గ్రహాల కలయిక ఈ రెండు గ్రహాలు కూడా సెప్టెంబర్ 20 ఉదయం 8 గంటలకు కన్యారాశిలోకి ప్రవేశం. ఈ కలయిక వల్ల మూడు రాశుల వారికి అదృష్టం ఆ మూడు రాశులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

కన్యా రాశి- సెప్టెంబర్ 20 సూర్యుడు, కేతు గ్రహాలు కలయిక వల్ల ఈ రాశి వారికి అదృష్టం ఉంటుంది. అక్టోబర్ 17 వరకు వీరికి మంచి ఫలితాలు ఉంటాయి. ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. మీరు చేసే ప్రతి పని కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. మీకు మీ వ్యాపారంలో పురోగతి ఉంటుంది. దీని ద్వారా మీ ఆదాయం పెరుగుతుంది. పెండింగ్లో ఉన్న పనులను కూడా పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులు విహారయాత్రలకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి.

మీనరాశి- ఈ రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది. ఉద్యోగం చేసే వారికి ప్రమోషన్ లభిస్తుంది ఆర్థిక సంక్షేమం నుండి ఉపశమనాన్ని పొందుతారు. ఆస్తుల వివాదాలు తొలగిపోయి ప్రశాంతంగా ఉంటుంది. రుణ బాధల నుండి విముక్తి పొందుతారు. సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. మీరు ఏదైనా పని చేయాలను నిర్ణయించుకున్నప్పుడు జాగ్రత్తగా ఆలోచించి ముందుకు వెళ్తారు. అందులో మీరు కచ్చితంగా విజయాన్ని సాధిస్తారు. వ్యాపారాన్ని విస్తరణ చేయడానికి ఇదే అనువైన సమయం. నూతన గృహాన్ని కొనుగోలు చేస్తారు విద్యార్థులు పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణులు అవుతారు.

Astrology: వారాహి మాతకు అత్యంత ఇష్టమైన 4 రాశులు ఇవే

తులారాశి- ఈ రాశి వారికి సూర్యుడు ,కేతు గ్రహాల కలయిక వల్ల కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. ఉద్యోగంలో ప్రమోషన్లు లభిస్తాయి. మీరు పని చేసే చోట సహోదయోగుల నుండి మద్దతు లభిస్తుంది. కలల రంగాలపట్ల మీకు మక్కువతో గౌరవం లభిస్తుంది. దానిలో విజయాన్ని సాధిస్తారు. వ్యాపారస్తులు అధిక లాభాలను పొందుతారు. ఉద్యోగం లేని వారికి మీరు కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది. సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. ఖర్చులు తగ్గుతాయి. ఆదాయం పెరుగుతుంది. అనారోగ్య సమస్య నుండి బయట పడతారు. దీని ద్వారా మానసికంగా ప్రశాంతంగా ఉంటారు.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం మత విశ్వాసాల ఆధారంగా పేర్కొనడం జరిగింది. జ్యోతిష్యం, జాతకం విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు.