జ్యోతిష శాస్త్రం ప్రకారం ఆగస్టు 4న అమావాస్య ఈ ఆషాడం ఈ నాలుగో తారీఖు తో ముగుస్తుంది. అప్పుడు సర్వ సిద్ధి యోగం ఏర్పడుతుంది. ఈ యోగం కలయిక వల్ల ఈ ఐదు రాశుల వారికి శుభాలు కలుగుతాయి. ఆ ఐదు నాశలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
కర్కాటక రాశి: ఆగస్టు 4 నుండి ఈ రాశుల వారికి కోరుకున్న ప్రతి ఒక్క కల కూడా నెరవేరుతుంది. మంచి జీవితంతో ఉద్యోగం ప్రారంభిస్తారు. వైవాహిక జీవితంలో ఏర్పడిన అనేక సమస్యల నుండి బయటపడతారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. మీ తల్లిదండ్రుల దీవెన ఎప్పుడు కూడా మీ పైన ఉంటుంది. వ్యాపారానికి తగినంత కష్టానికి తగిన లాభాలు పొందుతారు. స్టాక్ మార్కెట్లో లాభాలు పొందుతారు. వ్యాపారస్తులు తమ వ్యాపారాన్ని వృద్ధి చేసుకుంటారు.
వృశ్చిక రాశి: ఈ రాశి వారికి జీవిత భాగస్వామి నుండి సహాయక సహకారాలు అందుతాయి. ఇంట్లో ఆనంద వాతావరణం ఉంటుంది. మీరు చేసే ప్రతి పనిలో కూడా విజయాన్ని సాధిస్తారు ప్రశంసలు పొందుతారు. సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. పెట్టుబడును పెట్టడానికి అనుకూలమైన సమయం. నూతన గృహాన్ని కొనుగోలు చేస్తారు. ఎప్పటి నుంచి ఇబ్బంది పడుతున్న మానసిక సమస్యల నుంచి బయటపడతారు. మీ పిల్లల భవిష్యత్తు కోసం ఇప్పటినుంచే ప్రణాళికలు వేస్తూ ఉంటారు.
కన్యా రాశి: ఈ రాశి వారికి అదృష్టం చాలా ఉంటుంది. కష్టపడి పని చేసే తత్వం మీలో ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అద్భుతమైన ఫలితాలు పొందుతారు. విద్యార్థులు కష్టపడి పనిచేసి వారి రిజల్ట్స్ ని పొందుతారు. మీరు ఆర్థిక లాభాల కోసం చేసే ప్రతి పనిలో కూడా గొప్ప విజయాన్ని సాధిస్తారు. మీ ఆదాయం ఊహించనంతగా పెరుగుతుంది. నూతన వాహనాలను కొనుగోలు చేస్తారు విదేశీ పర్యటనలు చేసే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత నెలకొంటుంది.
తులారాశి: ఈ రాశి వారికి ప్రైవేట్ ఉద్యోగాల్లో జీతం పెరుగుతుంది. మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీరు ప్రభుత్వ ఉద్యోగాలు పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. వ్యాపారస్తులకు భారీ లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీరు పెద్ద పెద్ద డీల్ ని పొందవచ్చు. ఆదాయంలో ఘననీయమైన పెరుగుదల మీ జీవితాన్ని మారుస్తుంది. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. విద్యార్థులకు విదేశీయానం ఉంటుంది. కోరుకున్నా రంగాల్లో ఉద్యోగం లభిస్తుంది.
సింహరాశి: మీ వ్యాపారాన్ని విస్తరించేందుకు పెట్టుబడులు పెట్టడానికి ఇదే సరైన సమయం. మీరు సొంత వాహనాలను కొనుగోలు చేస్తారు మీ జీవితంలో సుఖసంతోషాలు పెరుగుతాయి. ఎప్పటినుంచో ఇబ్బంది పడుతున్న అనారోగ్య సమస్యల నుండి బయటపడతారు. లాభాల మార్జిన్ పెరుగుతుంది. కెరీర్ లో ఉన్నత స్థాయిలో ఉంటారు విద్యార్థులకు తమ కష్టపడి పని చేసినందుకు చక్కటి ఫలితం లభిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులకు ప్రమోషన్ లభిస్తుంది. సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం మత విశ్వాసాల ఆధారంగా పేర్కొనడం జరిగింది. జ్యోతిష్యం, జాతకం విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు.