జ్యోతిష శాస్త్రం ప్రకారం ఆగస్టు 11న శుక్ర గ్రహం తన నక్షత్రాన్ని మార్చుకొని పుబ్బా  నక్షత్రంలోనికి ప్రవేశిస్తుంది. దీని ద్వారా మూడు రాశుల పైన సానుకూల ప్రభావాన్ని చూపిస్తుంది. ఆ మూడు రాశులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

వృశ్చిక రాశి: ఈ రాశి వారికి శుక్ర గ్రహ ప్రభావం అనుకూలంగా ఉంటుంది. వీరికి ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులు ఉండదు. కొత్త వెంచర్ని ప్రారంభిస్తారు. వ్యాపారంలో లాభాలు అభివృద్ధి బాటన నడుస్తాయి. వ్యాపారస్తులకు తమ వ్యాపారాన్ని విస్తరించే అవకాశం ఉంది. సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి, ఆరోగ్యపరంగా కూడా ఎటువంటి సమస్యలు ఉండవు .ప్రేమ వివాహాలకు అనుకూలం.

ధనస్సు రాశి: ఈ రాశి వారికి శుక్రుని నక్షత్రం సంచారం వల్ల వారి పైన ప్రతికూల ప్రభావాలు తగ్గిపోతాయి. పరిశ్రమల నుంచి ఆశించిన మేరకు లాభాలు వస్తాయి. వ్యాపారాన్ని విస్తరించడంలో పురోగతి పొందుతారు కొత్త పెట్టుబడులకు మంచి సమయం ప్రభుత్వ ఉద్యోగస్తులకు ప్రమోషన్ లభిస్తుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో తమ కష్టానికి తగ్గట్టుగా ఫలితాన్ని పొందుతారు. రాజకీయ నాయకులకు సామాజిక కార్యక్రమాల వల్ల ఆర్థికంగా కూడా లాభాలు వస్తాయి. మీ కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెరుగుతుంది. ఎప్పటినుంచో ఇబ్బంది పడుతున్న ఆరోగ్య సమస్య నుంచి బయటపడతారు.

Health Tips: ఎండుద్రాక్ష నీరు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసా ...

కర్కాటక రాశి:  ఈ రాశి వారికి శుక్రుని  అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది. ఎప్పటినుంచో మానసికంగా ఇబ్బంది పెడుతున్న ఒక విషయం నుంచి బయటపడతారు. మీరు చేసే ప్రతి పనిలో కూడా విజయాన్ని పొందుతారు. వ్యాపారంలో లాభాలు వస్తాయి. సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. విదేశీయానం ఉంటుంది. ప్రేమ వివాహానికి కుటుంబ సభ్యుల నుండి ఆమోదం వస్తుంది .విద్యార్థులు భవిష్యత్తులో కోరుకున్న ఉద్యోగాన్ని పొందుతారు. నూతన గృహాన్ని కొనుగోలు చేస్తారు.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం మత విశ్వాసాల ఆధారంగా పేర్కొనడం జరిగింది. జ్యోతిష్యం, జాతకం విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు.