జ్యోతిష శాస్త్రం ప్రకారం శుక్ర గ్రహం ఒక బలమైన గ్రహం. ఇది ఆత్మవిశ్వాసానికి నాయకత్వ లక్షణాలకు పేరుగాంచిన గ్రహం ఉన్నత లక్ష్యాలను సాధించడానికి సూర్యగ్రహం చాలా కారణమవుతుంది. ఆగస్టు 16 శుక్రవారం నాడున సూర్యగ్రహం మరియు కేతు గ్రహం మాఘ నక్షత్రం లోనికి ప్రవేశిస్తుంది. ఈ రెండిటి కలయిక వల్ల ముఖ్యంగా ఈ ఐదు రాశుల పైన ప్రతికూల ప్రభావం చూపుతుంది.

మీనరాశి: సూర్యుడు మరియు కేతు గ్రహ కలయిక వల్ల మీన రాశి వారి జీవితాల పైన ప్రతికూల ప్రభావాలు ఎక్కువగా చూపిస్తుంది. మీ ఆదాయం కంటే ఖర్చులు ఎక్కువగా ఉంటాయి మీ ఆదాయం ఊహించనంతగా తగ్గిపోతుంది. అలాగే మీకు ఆదాయం వచ్చే వ్యాపారాలు కూడా మూసి వేయబడతాయి పెద్ద మొత్తంలో మీకు నష్టాలు రావచ్చు కుటుంబ సభ్యుల మధ్య గొడవలు పెరిగే అవకాశం ఉంది విద్యార్థులు తమ కోరుకున్న రంగంలో సీటు లభించదు. దీని ద్వారా వారు డిప్రెషన్ కి వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

వృశ్చిక రాశి: ఈ రాశి వారికి సూర్యుడు, కేతు గ్రహాల కలయిక వల్ల ప్రతికూల ప్రభావాలు ఎక్కువగా ఉన్నాయి. వీరి వ్యాపారం పైన ఇది ప్రభావం ఎక్కువగా చూపే అవకాశం ఉంది. మీరు ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు ఆచితూచి తీసుకోవాలి. లేకపోతే పొరపాటు కారణంగా ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. ఆర్థిక నష్టం జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. మీ పైన ఒత్తిడి పెరుగుతుంది. దీని ద్వారా మీరు మానసిక ఒత్తిడికి గురవుతారు. హైబీపీ సమస్య మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది.

ధనస్సు రాశి: ఈ రాశి వారికి సూర్యుడు ,కేతు గ్రహాల వల్ల అపార ధన నష్టం ఏర్పడే అవకాశం ఉంది. మీరు వ్యాపారంలో ఎలాంటి పెట్టుబడులు పెట్టకుండా ఉండాలి. ఎందుకంటే దీనివల్ల మీకు భారీ నష్టాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. పొరపాటున కూడా లాటరీ లాంటివి కొనకూడదు. ఎందుకంటే దీని వల్ల మీ ఆర్థిక పరిస్థితి మరింత దిగజారిపోతుంది. ఆరోగ్య సమస్యల పైన భారీగా ఖర్చు పెట్టాల్సి వస్తుంది. వాహన ప్రయాణాలు అంత మంచివి కాదు.

Astrology: శ్రీకాళహస్తి వాయులింగేశ్వరుడికి ఇష్టమైన 4 రాశులు ఇవే

తులారాశి: ఈ రాశి వారికి శుక్ర గ్రహం ,కేతు గ్రహాల కలయిక వల్ల మీకు అదృష్టం కలిసి రాదు విద్యార్థులు చదువుల్లో పాఠం కాదు ఏర్పడతాయి. ఆర్థిక సంక్షోభంలో పడతారు. అనారోగ్య సమస్యల నుంచి ఇబ్బంది పడతారు. మీరు కార్యాలయాల్లో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. మీ ప్రత్యర్ధులు మిమ్మల్ని ఓడించాలని చూస్తారు. కుటుంబంలో సంతోషం తగ్గుతుంది దూర ప్రయాణాలకు వెళ్లకుండా ఉండడమే మంచిది. ఎత్తైన ప్రదేశాలకు వెళ్ళకండి.

మిథున రాశి: ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితి బలహీనంగా మారుతుంది. వ్యాపార విస్తరణకు చేసే ప్రణాళికలు నష్టాన్ని తీసుకువస్తాయి. ఆర్థిక సంక్షేమం పెరుగుతుంది. ఉద్యోగస్తులు తమ కష్టానికి తగిన ఫలితం అందకపోవడంతో నిరాశకు గురవుతారు. ఆదాయం కంటే ఖర్చు ఎక్కువగా ఉంటుంది. మీ కుటుంబ సభ్యులలో కలహాలు రావచ్చు. అన్నదమ్ములతో గొడవలు పడే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం మత విశ్వాసాల ఆధారంగా పేర్కొనడం జరిగింది. జ్యోతిష్యం, జాతకం విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు.