rakhi

అన్నా చెల్లెల మధ్య ప్రేమకు ప్రతిరూపంగా ఈ రాఖీ పండుగ ప్రాముఖ్యత ఉంది. శ్రావణమాసంలో వచ్చే శుక్లపక్ష పౌర్ణమి రోజున రాఖీ పండుగను జరుపుకుంటారు. హిందూ క్యాలెండర్ ప్రకారం ఈ సంవత్సరం రాఖీ పండుగ ఆగస్టు 19వ తేదీన వస్తుంది. ఈ రోజున సోదరీ సోదరీమణులు రాఖీని కట్టుకుంటారు. దీని ద్వారా అతని ఆయుష్షు పెరుగుతుందని నమ్మకం. దీంతో వారు బహుమతులు కూడా ఇస్తారు. అయితే రాఖీ పండుగ రోజు రాఖీ కట్టేటప్పుడు ఏ చేతికి కట్టాలి? ఏ సమయంలో కట్టాలి ఏ దిశలో కూర్చుని కట్టాలి అనేది చాలామందికి తెలియదు. కాబట్టి ఈరోజు మనం ఆ విషయాల గురించి తెలుసుకున్నాం.

రాఖీ పండుగ రోజు ఉదయమే తలస్నానం చేసి దేవుడికి దండం పెట్టుకొని రక్షాబంధన్ వేడుకను ప్రారంభించాలి. ఈసారి రాఖీ పండుగ ఆగస్టు 19న వచ్చింది. అయితే ఈరోజు ఆరోజు మధ్యాహ్నం 1: 32 నిమిషాల నుండి 4: 20 నిమిషాల వరకు మాత్రమే రాఖీ కట్టడానికి అనుకూలమైన సమయం. దీనికి ముందు అంటే ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం వరకు మంచి సమయం లేదు. కాబట్టి ఆ సమయంలో రాఖీ కట్టకూడదు. దీని వల్ల ఆ శుభం.

Astrology: రాఖీ పౌర్ణమి తో పాటు యాదృచ్ఛికంగా ఈసారి రెండు యోగాల ...

ఏ దిశలో రాఖీ కట్టాలి: రాఖీ కట్టేటప్పుడు సోదరుడు ముఖం తూర్పు వైపున లేదా ఉత్తరం వైపున ఉండాలని మన జ్యోతిష్య నిపుణులు చెప్పారు . రాఖీ కట్టేటప్పుడు సోదరి తలపైన కచ్చితంగా కొంగు వేసుకోవడం మర్చిపోకండి. రాఖీ కట్టే ముందు నుదుటన బొట్టు పెట్టాలి. ఆ తర్వాత సోదరి కుడి చేతికి రాఖీ కట్టాలి. తర్వాత సోదరుడు నుండి ఆశీర్వాదం తీసుకోవాలి.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం మత విశ్వాసాల ఆధారంగా పేర్కొనడం జరిగింది. జ్యోతిష్యం, జాతకం విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు.