జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శని అన్ని గ్రహాలతో పోలుస్తే కాస్త నెమ్మదిగా కదులుతుంది. ఆగస్టు 21 నుండి శనిగ్రహం తన కదలికను మార్చుకుంటుంది. దీనివల్ల అన్ని రాశులు ప్రభావ ప్రయోజనకరంగా ఉంటాయి. ముఖ్యంగా ఈ మూడు రాశులు అదృష్టాన్ని కలిసి వస్తుంది ఆ మూడు రాశులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
మిథున రాశి: శని గమనంలో మార్పు కారణంగా మిథున రాశి జీవితాల పైన చాలా అనుకూల ప్రభావాన్ని చూపుతుంది. ఈ రాశికి చెందిన వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. దీంతో కొత్త వ్యాపారాలు చేయాలనే ఆలోచనలు పెంపొందించుకుంటారు. వ్యాపారం చేసేవారిలో గణనీయమైన పురోగతి లభిస్తుంది. విద్యార్థులు కోరుకున్న రంగాల్లో సీటు లభిస్తారు. దీని ద్వారా వారికి స్కాలర్షిప్ వస్తుంది. ఉద్యోగస్తులు మీ ప్రయత్నాల వల్ల మంచి ఆదాయాన్ని పొందే ఉద్యోగాన్ని పొందుతారు. ఆరోగ్య సమస్యలు దూరం అయిపోతాయి. దీనివల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య సంతోషంగా గడుపుతారు ప్రేమ వివాహాలకు అనుకూలం.
కన్యా రాశి: శని గ్రహం కదలిక వల్ల కన్యారాశి వారికి వారి జీవితాల పైన సానుకూల ప్రభావాన్ని ఎక్కువగా చూపిస్తుంది. వీరి జీవితంలో డబ్బుకు ఎటువంటి కొలవ ఉండదు. డబ్బు సంపాదనకు బలమైన అవకాశం లభిస్తుంది. కొత్తగా ఆదాయం వనరులు వస్తాయి. నూతనంగా గృహాన్ని కొనుగోలు చేస్తారు. విద్యార్థుల కృషి వలన ఫలితాలు లభిస్తాయి. మీ ప్రాజెక్టు వర్క్ ల కోసం కష్టపడాల్సి ఉంటుంది. దీని ద్వారా మీరు అవార్డును అందుకుంటారు వ్యాపారాలు చేసే వారిలో ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్ లభిస్తుంది. ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది.
Astrology: బద్రినాథ్ కు అత్యంత ఇష్టమైన 4 రాశులు ఇవే…
మీన రాశి: ఈ రాశి వారికి శని గ్రహం కదలిక వల్ల సానుకూల ప్రభావాలు ఎక్కువగా ఉన్నాయి. వీరు చేపట్టిన ప్రతి పనిలో కూడా పురోగతి లభిస్తుంది. డబ్బు సంపాదనకు మీరు చేసే ప్రయత్నాలు అన్నీ కూడా ఫలిస్తాయి. ఆర్థికపరమైన నష్టాలు ఉండవు. వ్యాపారవేత్తలు విదేశీ వ్యానిజం నుండి లాభాలు పెంచుకుంటారు. భాగస్వామ్య వ్యాపారాలు చేసే వారికి లాభాలు ఎక్కువగా ఉంటాయి. కోర్టులో న్యాయపరమైన సమస్యల నుంచి ఉపశమనాన్ని పొందుతారు. ఆరోగ్య సమస్యలు దూరం అవుతాయి. పెద్దల నుండి ఆశీస్సులు అందుకుంటారు. కుటుంబ సభ్యులతో కలిసి దూర ప్రయాణాలకు విహారయాత్రలకు వెళ్తారు. నూతన గృహాన్ని కొనుగోలు చేస్తారు.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం మత విశ్వాసాల ఆధారంగా పేర్కొనడం జరిగింది. జ్యోతిష్యం, జాతకం విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు.