కుజుడు ,శుక్రుడి కదలికలు వల్ల ప్రత్యేక యోగాలు ఏర్పడతాయి. ఇవి అన్ని రాశుల వారి జీవితాల పైన ప్రభావాన్ని చూపిస్తాయి. ముఖ్యంగా ఈ రెండు గ్రహాల కలయిక సంపదకు వివాహానికి ,సంతానానికి అధిపతి శుక్రుడు. శుక్రుడు ,కుజ గ్రహాల కలయిక వల్ల ఈ మూడు రాశుల పైన ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఆర్థికంగా లాభాలు పొందుతారు. ఆ మూడు రాశులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
మీనరాశి: ఈ రాశి వారికి కుజ గ్రహం ,శుక్ర గ్రహం కలయిక వల్ల సానుకూల ప్రభావం ఉంటుంది. మానసిక ఆందోళనలు తగ్గుతాయి. కొత్త వ్యాపారాలలో కోసం చేసే ఆలోచనలు అభివృద్ధి చెందుతాయి. విద్యార్థులు పెండింగ్లో ఉన్న పనులను సకాలంలో పూర్తి చేస్తారు. మీరు ప్రభుత్వ ఉద్యోగులు అయితే ప్రమోషన్ లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆర్థిక సమస్యలు పరిష్కారమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వ్యాపారాన్ని వృద్ధి చేస్తారు కొత్త ఆదాయం అనరులు ఏర్పడతాయి. వ్యాపారస్తులు తమ వ్యాపారాన్ని విస్తరణకు చాలా అనుకూలం మానసిక ఒత్తిడి తగ్గుతుంది. కుటుంబ సభ్యులతో అన్యోన్యంగా ఉంటారు నూతన గృహాన్ని కొనుగోలు చేస్తారు.
ఈ రాశి వారికి పాత బాకీలు వసూలవుతాయి, ఆకస్మిక ధనలాభం వస్తుంది ...
తులారాశి: ఈ రాశి వారు తొందరపడి నిర్ణయాలు తీసుకుంటే మంచిది కాదు. సహనం కలిగి ఉండాలి మానసిక ప్రశాంతత పెరుగుతుంది. లేకపోతే గొడవలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వ్యాపార సంబంధాలు బలపడతాయి. కొత్త వ్యక్తులను కలుస్తారు. లాభాలు పెరుగుతాయి. విద్యార్థులకు విదేశీయుల చదివే అవకాశం లభిస్తుంది. కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగంలో ప్రమోషన్లకు అవకాశం ఉంటుంది. పెట్టుబడి ద్వారా వచ్చే లాభం రెట్టింపు అవుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళతారు. నూతన వాహనాలను కొనుగోలు చేస్తారు ఎప్పటినుంచో రావాల్సిన మొండి బకాయి వస్తుంది.
వృషభ రాశి: శుక్ర గ్రహం, పూజ గ్రహం కలయిక వల్ల సానుకూల ప్రభావం చూపుతుంది. మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఆందోళన తగ్గుతాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. సమాజంలో మీకు గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. స్థిరత్వం ఉంటుంది. మీకు పని భారం తగ్గుతుంది. కొత్త ఆదాయం వనరులు లభిస్తాయి. దీనివల్ల ఆర్థిక సంక్షోభానికి పరిష్కారం లభిస్తుంది. ప్రేమ వివాహాలు అనుకూలం ఆరోగ్యం బాగుంటుంది. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత నెలకొంటుంది. విదేశీ పర్యటనలు చేస్తారు. కోర్టు సంబంధ సమస్యలు తొలగిపోతాయి.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం మత విశ్వాసాల ఆధారంగా పేర్కొనడం జరిగింది. జ్యోతిష్యం, జాతకం విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు.