కృష్ణాష్టమి అంటే కృష్ణుని జన్మదినం. దేవకీకి ఎనిమిదో సంతానంగా కృష్ణుడు జన్మిస్తాడు. ఆ రోజునే కృష్ణాష్టమి అంటారు.శ్రావణ మాసంలో వచ్చే కృష్ణపక్షంలో అష్టమి నాడు కృష్ణుడు జన్మించాడు. కృష్ణడు జన్మించిన రోజునే కృష్ణాష్టమి అంటారు. ఇది ఎంతో భక్తి శుభసూచకం. ఇది అత్యంత పర్వదినం. ఈరోజున కృష్ణుని భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తే సకల శుభాలు కలుగుతాయని మన పురాణాల్లో ఉంది. అదే విధంగా ఇంట్లో చిన్న పిల్లలకి చిన్ని కృష్ణుడి వేషం వేసి సంతోషిస్తారు .
పూజా విధానం
పొద్దుటే లేసి ఇంటిని శుభ్రం చేసుకొని తల స్నానం చేసి ఇంటిలోని ఈశాన్యంలో శుద్ధి చేసి బియ్యపు పిండితో ముగ్గు వేయాలి. అక్కడ ఒక పీటను ఏర్పాటు చేయాలి. ఆ పీటకు పసుపు, కుంకుమ రాసి బొట్టు పెట్టాలి. అక్కడ పద్మ దళాన్ని వేయాలి. పూజ చేసేవారు తూర్పుముఖంగా కూర్చోవాలి. మీరు కృష్ణుని ప్రతిమను తీసుకొని ఆ పీటపై పెట్టి పసుపు గణపతిని తయారు చేసి అక్కడ పెట్టి దానికి పసుపు కుంకుమ బొట్లు పెట్టాలి. తర్వాత తమలపాకులను తీసుకొని అగరవత్తులు పూజకు కావలసిన సామాగ్రి అంతా కూడా అమర్చుకోవాలి. దీపారాధనను నైరుతి దిశలో ఉంచి చేయాలి. అంటే కాకుండా గడపకు పసుపు, కుంకుమను రాసి గుమ్మానికి మామిడి ఆకులు తోరణాలు కట్టాలి.
Astrology: హనుమంతునికి ఇష్టమైన 4 రాశులు ఇవే..
మధ్యాహ్నం 12 గంటల్లోపే పూజను ప్రారంభిస్తే మంచిది. కృష్ణుడు పటం ముందు ఐదు ఒత్తుల దీపాన్ని వెలిగించి శ్రీకృష్ణ పరబ్రహ్మే నమః అనే మంత్రాన్ని 108 సార్లు పట్టించాలి. ఈ రోజున ఉపవాసం ఉంటే చాలా మంచిది. శ్రీకృష్ణునికి ఇష్టమైన నైవేద్యాలను పెట్టాలి ముఖ్యంగా కృష్ణుడికి వెన్న అంటే చాలా ఇష్టం. అంతేకాకుండా ఏదైనా తీపి వంటకాలు కూడా చేసి పెట్టాలి.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం మత విశ్వాసాల ఆధారంగా పేర్కొనడం జరిగింది. జ్యోతిష్యం, జాతకం విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు.