జ్యోతిష శాస్త్రం ప్రకారం కుజ గ్రహం ఎంతో బలమైనది. శక్తివంతమైనదిగా ఉంటుంది. ఆగస్టు 6 ఉదయం 7 గంటల నుంచి కుజ గ్రహం రాశి మార్పు కారణంగా అన్ని రాశుల పైన ప్రతికూల ప్రభావాలు ఉంటాయి. ముఖ్యంగా ఈ ఐదు రాశుల వారి పైన ఎక్కువ ప్రభావం చూపుతుంది. దీనివల్ల వీరు దురదృష్టాన్ని పొందుతారు. అంతేకాకుండా జీవితంలో కష్టాలపాలు కాబోతున్నారు. వారి ఖర్చులు కూడా పెరుగుతాయి. ఆ ఐదు రాశులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
కుంభరాశి: కుంభ రాశి వారు కుజ గ్రహం రాశి మార్పు కారణంగా అనేక నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల మీరు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. అంతే కాకుండా ఆర్థికంగా కూడా నష్టపోతారు. ఉద్యోగస్తులు తమ ఉద్యోగాన్ని కోల్పోయే అవకాశం ఉంది. వ్యాపారాన్ని విస్తరించడానికి ఇది అనువైన సమయం కాదు. మీ తొందరపాటు నిర్ణయాల వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. వ్యాపారంలో భాగస్వామ్య పెట్టుబడులకు అనుకూలం కాదు.
తులారాశి: ఈ రాశి వారికి కారణంగా ఆర్థిక నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది జాగ్రత్త పడాలి తీసుకున్న రుణాన్ని సరైన సమయంలో తీర్చకపోవడం ద్వారా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఉద్యోగంలో తీవ్ర ఒత్తిడి ఉంటుంది మీ పై అధికారుల నుండి ఒత్తిడి ఎదురుకోవాల్సి వస్తుంది. ఆరోగ్యపరంగా కూడా కొన్ని సమస్యలు తలెత్తుతాయి వాహన ప్రయాణాలు చేయకుండా ఉండడమే ఉత్తమం.
Astrology: మీరు ఉదయం నిద్రలేచిన వెంటనే ఈ పనులు చేస్తే చాలు ...
మేషరాశి: ఈ రాశి వారికి కుటుంబ సభ్యుల మధ్య వివాదాలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండడం ఉత్తమం. సహోదయోగులతో వివాదాలు ఏర్పడే అవకాశం ఉంది. మీరు చేసే పనిలో ప్రతికూల ప్రభావం ఏర్పడుతుంది. విద్యార్థులు కొన్ని తప్పుడు నిర్ణయాల వల్ల వారి ర్యాంకును కోల్పోవాల్సి వస్తుంది. స్నేహితుల మధ్య కూడా గొడవలు పెరిగే అవకాశం ఉంది. భాగస్వామితో గొడవలు పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దూర ప్రయాణాలు చేయకపోవడమే ఉత్తమం. రుణ బాధలు ఎక్కువవుతాయి.
కర్కాటక రాశి: వీరికి చాలా ఇబ్బంది ఉంటుంది. పని పైన అజాగ్రత్తగా ఉండకూడదు. దీనివల్ల మీరు ఉద్యోగం నుంచి తొలగించబడతారు. వ్యాపారవేత్తల ప్రత్యర్ధులు మీ పనిని నాశనం చేయడానికి తమ వంతు ప్రయత్నాలు చేస్తారు. రాబోయే రోజుల్లో మీరు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతారు. మీ జీవిత భాగస్వామితో గొడవలు పెట్టుకునే అవకాశం ఉంటుంది. దీని ద్వారా మీ తల్లిదండ్రులు కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది. విద్యార్థులకు కోరుకున్న రంగాల్లో సీటు లభించదు.
వృశ్చిక రాశి: రాశి వారికి ఎప్పటినుంచో ఉన్న ఆరోగ్య సమస్య మరింత తీవ్రమవుతుంది. దీని కారణంగా మీరు డబ్బును అధికంగా ఖర్చు చేస్తారు. ఉద్యోగస్తులు మీ కెరీర్ కు సంబంధించిన విషయాలను ఆచితూచి నిర్ణయం తీసుకోండి లేకపోతే జీవితాంతం పశ్చాత్తాప పడాల్సి వస్తుంది. పరీక్షల్లో ఫెయిల్ కావడం ద్వారా విద్యార్థులు కొంత ఆందోళనకు గురవుతారు. దీని వల్ల మీకు ప్రతికూల ఆలోచనలు వస్తాయి. దీని వల్ల మీరు మానసికంగా తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటారు. దూర ప్రయాణాలు చేయకపోవడమే ఉత్తమం వాహన ప్రమాదాలు పొంచి ఉన్నాయి.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం మత విశ్వాసాల ఆధారంగా పేర్కొనడం జరిగింది. జ్యోతిష్యం, జాతకం విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు.