astrology

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆగస్టు 26 నుండి సూర్యుడు సింహరాశిలోకి ప్రయాణిస్తాడు. అప్పటికే సింహరాశిలో ఉన్న బుధుడు బుధాదిత్య ,శుక్రుడి శుక్రాతిత్యా అనే రెండు శుభకరమైన రాజయోగాలు ఏర్పడతాయి. ఈ రెండిటి కలయిక వల్ల శుక్రాదిత్య రాజయోగం ఏర్పడుతుంది. ఇది చాలా శుభకరం. ఈ యోగం వల్ల మూడు  రాశుల వారికి ధన ప్రవాహం సమాజంలో గౌరవం వ్యాపారంలో గొప్ప విజయాలు పొందుతారు. ఈ రెండు రాజయోగాలు అన్ని రాశుల పైన ప్రభావాన్ని చూపుతాయి ముఖ్యంగా ఈ మూడు రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. ఆ మూడు రాశులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

మేషరాశి: శుక్రాదిత్య రాజయోగం కారణంగా ఈ మేషరాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది. బుధుడు ,శుక్రుడు మిశ్రమం కారణంగా వీరు చేపట్టిన ప్రతి పనిలో కూడా విజయం సాధించాలని బలమైన అవకాశాలు వీరికి ఉన్నాయి. ఆరోగ్యం పైన అత్యంత సానుకూల ప్రభావం చూపుతుంది. మీరు ఎప్పటినుంచో ఇబ్బంది పడుతున్న పాత వ్యాధుల నుండి ఉపశమనాన్ని పొందుతారు. దీని వల్ల మీరు మానసికంగా చాలా ఆనందంగా ఉంటారు. బుధాదిత్య యోగం వల్ల మీకు సమాజంలో గౌరవం పెరుగుతుంది. విద్యార్థులు ఎక్కువ ప్రయోజనం పొందుతారు. మీరు తీసుకునే ప్రతి నిర్ణయం కూడా చాలా మీ ఉన్నతికి ఉపయోగపడుతుంది. డబ్బు సంపాదించడానికి నూతన మార్గాలు కనిపిస్తాయి.

కర్కాటక రాశి: సూర్యుని సంచారం కారణంగా శుక్ర యోగం ఏర్పడుతుంది. దీనివల్ల ఈ కర్కాటక రాశి వారికి చాలా అదృష్టం కలిసి వస్తుంది. ముఖ్యంగా మీ ఆదాయం రెట్టింపు అవుతుంది. మీకు అనేక మార్గాల నుండి ధన ప్రవాహం పెరుగుతుంది. మీకు ఎక్కువ మొత్తంలో రాబడులు వస్తాయి. అదే విధంగా ఎప్పటినుంచో ఇబ్బంది పడుతున్న అనారోగ్య సమస్య నుంచి బయటపడతారు. దీని ద్వారా వృధా ఖర్చులు తగ్గిపోతాయి వ్యాపారంలో కొత్త పెట్టుబడులు పెట్టడానికి ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. నూతన గృహాన్ని కొనుగోలు చేయడానికి మీకు అవకాశాలు ఎక్కువ ఉన్నాయి స్టాక్ మార్కెట్లో మీకు ఊహించని విధంగా లాభాలు వస్తాయి. సామాజికంగా కుటుంబ సంబంధాల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. వైవాహిక జీవితంలో సంతోషం పెరుగుతుంది ప్రేమ వివాహాలకు అనుకూలం. విదేశీ యానం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

Astrology: మీ వ్యాపారంలో బాగా నష్టాలు వస్తున్నాయా...

వృశ్చిక రాశి: ఈ రెండు రాజయోగాల వల్ల వృశ్చిక రాశి వారికి జీవితంలో తీసుకునే ప్రతి నిర్ణయం కూడా విజయవంతంగా పూర్తవుతుంది. మీరు తీసుకునే ప్రతి నిర్ణయం కూడా ఆత్మవిశ్వాసంతో మనోబలంతో తీసుకుంటారు. కాబట్టి మీరు ఏ పని చేసినా కూడా విజయాన్ని పొందుతారు. మీ వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవడానికి చేసే ప్రయత్నాలు సఫలం అవుతాయి. విద్యార్థులకు విదేశాల్లో చదువుకోవాలన్న కోరిక మేరకు వారికి సీటు లభిస్తుంది. మీరు భాగస్వామ్య వ్యాపారం నుండి అనేక ప్రయోజనాలు ఆర్థిక లాభం పొందుతారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది. ప్రభుత్వ రంగంలో పని చేసే వారికి ప్రమోషన్స్ లభించే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు నూతన వాహనాలను కొనుగోలు చేస్తారు రుణ బాధల నుండి విముక్తి పొందుతారు.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం మత విశ్వాసాల ఆధారంగా పేర్కొనడం జరిగింది. జ్యోతిష్యం, జాతకం విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు.