మేషం: ఈ రాశి వారు త్వరలోనే ఉన్నత స్థానానికి చేరుకుంటారు తాము ఎంపిక చేసుకున్న రంగంలో వారు విజయం సాధిస్తారు. ఉద్యోగ వ్యాపారాల్లో మీరు తిరుగులేదని నిరూపిస్తారు. లక్ష్మీదేవి కటాక్షంతో వీరికి ఎలాంటి డబ్బులోటు ఉండదు. సంతానం విషయంలో వీరు శుభవార్తలు వింటారు అలాగే తల్లిదండ్రుల ఆరోగ్యం విషయంలో కూడా కాస్త జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. ఆరోగ్య విషయంలో మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి.బయటి ఆహారం తినకూడదు. దుర్గాదేవిని పూజించండి.
వృషభం: ఈ రాశి వారు వ్యాపారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. లేకపోతే బాగా దగ్గర వారి చేతిలోనే మోసపోయే ప్రమాదం ఉంటుంది. నూతన వ్యాపారం చేపట్టే వారికి ఇది మంచి కాలం అని చెప్పవచ్చు. వ్యాపారంలో మంచి లాభాలు పొందే అవకాశం లభిస్తుంది. . కుటుంబ జీవితం సుఖమంతంగా ఉంటుంది. మీ భాగస్వామి చేసిన పని వల్ల మీకు సంతోషం లభిస్తుంది. దూర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఒంటరిగా వెళ్ళకండి తోడు ఎవరినైనా తీసుకొని వెళ్ళండి. ప్రతి మంగళవారం హనుమంతుడికి ఆవు నెయ్యితో దీపం వెలిగించండి.
సింహం: ఈ రాశి వారు వ్యాపార రంగంలో చక్కగా రాణిస్తారు. రియల్ ఎస్టేట్ రంగంలో వ్యాపారం చేసే వారితో పాటు ఐటీ రంగంలో ఉద్యోగం చేసేవారు కొన్ని శుభవార్తలు వినే అవకాశం ఉంటుంది. ప్రైవేటు ఉద్యోగం చేసేవారు తమ ప్రమోషన్ కారణంగా మంచి వేతనం పొందుతారు. తమ సంతానం కారణంగా తల్లిదండ్రులు మంచి పేరు సంపాదిస్తారు. కోర్టు వివాదాల్లో ఉన్నటువంటి ఆస్తులు మీకు లభించే అవకాశం ఉంది. పుణ్యక్షేత్రాలకు వెళ్లే వీలుంది ఇందుకోసం మీరు చేసే ప్రయత్నాలు పాలిస్తాయి. ప్రతి గురువారం లక్ష్మీదేవిని పూజించండి.
కన్య: ఈ రాశి వారు వ్యాపారంలో మంచి వార్తలు వింటారు నూతనంగా వ్యాపారం ప్రారంభించాలని అనుకున్నట్లయితే ఇది మీకు మంచి సమయం అని చెప్పవచ్చు. మీరు వస్త్ర వ్యాపారం చేస్తున్నట్లు అయితే పెద్ద ఎత్తున లాభం పొందే అవకాశం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, ఐటి రంగంలో ఉద్యోగం చేసేవారు మంచి వార్తలు వింటారు. మార్కెటింగ్ ఉద్యోగం చేసేవారు కూడా తమ సవాళ్లను అధిగమించి శుభవార్తలు వినే అవకాశం ఉంది. గణపతిని పూజించండి.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం మత విశ్వాసాల ఆధారంగా పేర్కొనడం జరిగింది. జ్యోతిష్యం, జాతకం విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు.