astrology

ప్రతి గ్రహం ఒక రాశి నుండి మరొక రాశికి కదులుతూనే ఉంటుంది. అయితే కొన్నిసార్లు గ్రహాలు సవ్య దిశలోను ,వ్యతిరేక దిశలోను కూడా కదులుతాయి. వీటివల్ల చాలా మార్పులు జరుగుతాయి. జూన్ 29 నుంచి బుధుడు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. ఆ తర్వత కొన్ని గంటల్లోనే మళ్లీ శనిగ్రహం తన రాశి చక్రాన్ని కుంభరాశిలోకి వ్యతిరేక దిశలో మార్పు చెందుతుంది. ఒకేసారి ఈ రెండు గ్రహాలు రాశుల మార్పు కారణంగా  ఈ నాలుగు రాశుల వారికి చాలా ఇబ్బంది కలుగుతాయి. ఆ రాశులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

మేష రాశి: ఈ రాశిలో జన్మించిన వారికి తమకేరీర్లో సవాళ్లను ఎదుర్కొనవలసి వస్తుంది. వ్యాపారం  చేసినట్లయితే వ్యాపారంలో నష్టాలు రావచ్చు. ఆరోగ్యపరంగా కూడా కొంచెం ఇబ్బందులు తలెత్తే ఎటువంటి అవకాశాలు ఉన్నాయి. ఒక్కోసారి మీరు ఏ పని చేసినా కూడా ఆ పనిలో విజయం సాధించరు. విద్యార్థులకు ఆందోళన కలిగేటువంటి ఫలితాలు రావచ్చు. ఇటువంటి సమస్యలు తలెత్తుతాయి.

కర్కాటక రాశి: ఈ రాశి వారికి శని, బుధ గ్రహాల మార్పుల వల్ల ఆర్థిక సమస్యలు చాలా పెరుగుతాయి. ఖర్చులు కూడా బాగా పెరుగుతాయి. సంపాదించిన దాని కంటే కూడా ఖర్చు చాలా ఎక్కువగా ఉంటుంది. మీ ఇంట్లో డబ్బు కొరత రావచ్చు. కాబట్టి ఖర్చు పెట్టే ముందు జాగ్రత్తగా ఆలోచించి ఖర్చు పెట్టండి. అదేవిధంగా వ్యాపారానికి సంబంధించిన ఏమైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి. ఆస్తి కొనుగోలు విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండండి. మీరు బీపీ పేషెంట్లు అయినట్లయితే కాస్త జాగ్రత్తగా ఉండాలి.

తులారాశి: ఈ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. మీరు ఏ పని చేసినా అంతా సవ్యంగా జరుగుతుంది అని అనిపిస్తుంది కానీ అకస్మాత్తుగా అందులో సమస్యలు అనేవి రావచ్చు. మీకు ఆదాయం బానే ఉంటుంది కానీ మీ ఖర్చులు అంతకుమించి ఎక్కువగా ఉండి మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. మీరు ఆర్థికంగా చాలా ఇబ్బందిని ఎదుర్కోవాల్సి వస్తుంది. కుటుంబంలో కలతలు ఏర్పడతాయి. శత్రువులు పెరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండాలి.

సింహరాశి : ఈ రాశి వారికి ఆరోగ్య సమస్యలు చాలా ఇబ్బంది పెడతాయి. మీ కుటుంబంలోని పెద్దల ఆరోగ్యం పైన మీరు శ్రద్ధ వహించాల్సి వస్తుంది. చిన్నపాటి ఆరోగ్య సమస్య వచ్చిన వెంటనే హాస్పిటల్ కి వెళ్లాల్సిందే. కెరీర్లో ఆటంకాలు కలగవచ్చు. ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడండి. ఎందుకంటే గొడవలు పడే అవకాశం ఉంది. ఎవరైనా మిమ్మల్ని బాధ పెడితే కాస్త ఓపిక పట్టండి. అంతేకానీ గొడవకు దిగకుండా ఉండడం మంచిది. నూతన వాహనాలు ఆస్తులు కొనుగోలు చేయాలనుకుంటే కాస్త ఆగడం మంచిది.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం మత విశ్వాసాల ఆధారంగా పేర్కొనడం జరిగింది. జ్యోతిష్యం, జాతకం విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు.