ప్రతి ఒక్కరి జీవితంలో కూడా సంపద నిలవాలని కోరుకుంటారు. సకల సకల శుభాలకు దేవత లక్ష్మీదేవి మన ఇంట్లో ఉండాలని అందరూ కోరుకుంటారు. లక్ష్మీదేవి అనుగ్రహం కోసం భక్తులు అనేక రకాలైనటువంటి పూజలు చేస్తూ ఉంటారు. లక్ష్మీదేవి ఇంట్లో ఉండడానికి కొన్ని రకాలైనటువంటి పనులు చేస్తే ఆ లక్ష్మీదేవి ఎప్పుడు కూడా మీ ఇంట్లో స్థిర నివాసం ఉంటుంది. ఇంట్లో ఆనందం శుభకార్యాలు జరుగుతాయి. ఇంట్లో వాతావరణం అనుకూలంగా ఉంటుంది.
ఇంటిముందు ముగ్గు వేయండి- ప్రతిరోజు ఉదయాన్నే ఐదు గంటలకు నిద్ర లేచి భగవంతుడిని పూజించిన తర్వాత ఇంటి ముందు శుభ్రం చేసుకొని పద్మం ముగ్గులు వేసుకోవాలి. ఇలా చేస్తే లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుందని అందరూ నమ్ముతారు. ఆర్థిక సమస్యల నుండి బయటపడతారు.
తులసి మొక్కను పూజించండి- తులసి చెట్టుని అందరూ లక్ష్మీదేవిగా పూజిస్తారు. తులసి మొక్కకు మన మతాల్లో ఒక ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. తులసి మొక్కలు లక్ష్మీదేవి నివసిస్తుంది. క్రమం తప్పకుండా ప్రతిరోజు ఉదయం తులసి మొక్కను పూజిస్తే ఆ ఇంట్లో ఆనందం శ్రేయస్సు లభిస్తుంది.
Astrology: సెప్టెంబర్ 14న సర్వార్ధ సిద్ధి యోగం, రవి యోగం
దీపం వెలిగించండి- ప్రతిరోజు ఉదయం ఐదు గంటలకు లేచి స్నానం చేసి పూజ చేసుకొని మీ ఇంట్లో ప్రధాన ద్వారం వద్ద దీపాన్ని వెలిగిస్తే మీకు ఆ లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది. ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి.
సూర్య భగవానుడికి మొక్కండి- ఉదయమే నిద్రలేచిన తర్వాత స్నానం చేసి భగవంతునికి పూజ చేసిన తర్వాత సూర్యభగవానుడికి నమస్కరిస్తే సకల శుభాలు జరుగుతాయి. అంతేకాకుండా ఆర్థిక సమస్యలు తొలగిపోయి మీకు గౌరవం లభిస్తుంది.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం మత విశ్వాసాల ఆధారంగా పేర్కొనడం జరిగింది. జ్యోతిష్యం, జాతకం విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు.