ప్రతి ఏకాదశి కూడా ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. ఇది ఎంతో శుభప్రదమైన రోజు. ఈ రోజు పూజలు చేయడం ద్వారా మంచి ఫలితాలు కలుగుతాయని నమ్మకం. ఈనెల 14వ తేదీన యాదృచ్ఛికంగా రెండు యోగాలు కలయిక వల్ల అదృష్టం కలిసి వస్తుంది. సర్వార్ధ సిద్ధియోగం, రవి యోగం ఈ రెండు యోగాలు యాదృచ్ఛిక కలయిక వల్ల మూడురాశుల వారికి ఎంతో అదృష్టం, ఆ మూడు రాశులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
మేషరాశి- మేష రాశి వారికి ఏకాదశి నాడు రవి యోగం, సర్వార్ధ సిద్ధియోగం కలయిక వలన అనేక అనుకూల ప్రయోజనాలు పొందుతారు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో మొదటి స్థానంలో వస్తారు. దీని ద్వారా వీరిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో వీరి జీతాలు పెరుగుతాయి. వ్యాపార రంగంలో ఉన్నవారికి అద్భుత లాభాలు వస్తాయి.
మీనరాశి- ఈ రాశి వారికి శ్రీమహావిష్ణువు ఆశీర్వాదంతో జీవితంలో సానుకూలత ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య ఎప్పటినుంచో ఉన్న గొడవలు సమస్య పోయి ఆనందంగా ఉంటారు. మీ ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. జీవిత భాగస్వామి నుండి పూర్తి మద్దతు లభిస్తుంది. వ్యాపారంలో మీరు అనుకున్న విధంగా లాభాలు వస్తాయి. వ్యాపారాన్ని విస్తరించడానికి మీరు తలపెట్టే పని విజయవంతంగా పూర్తవుతుంది. విద్యార్థులు తమకేరిలో గొప్ప విజయాలను సాధిస్తారు. నూతన గృహాన్ని కొనుగోలు చేస్తారు.
strology: బద్రినాథ్ కు అత్యంత ఇష్టమైన 4 రాశులు ఇవే
కన్యారాశి- ఈ రాశి వారికి ఏకాదశి రోజున అద్భుత ఫలితాలు లభిస్తాయి. ఈరోజు వీరు ఉపవాసం చేసినట్లయితే మీ ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. ఎప్పటి నుండ ఉన్న అప్పుల బాధ నుండి బయటపడతారు. ప్రభుత్వ ఉద్యోగుల వారికి ప్రమోషన్ లభిస్తుంది. కెరీర్లో పురోగతి పొందుతారు. సొంతంగా వ్యాపారం చేసుకునే వారికి మంచి లాభాలు వస్తాయి. విదేశీ పర్యటనలు చేస్తారు కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళతారు.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం మత విశ్వాసాల ఆధారంగా పేర్కొనడం జరిగింది. జ్యోతిష్యం, జాతకం విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు.