జ్యోతిష శాస్త్రం ప్రకారం ఆగస్టు 22న బుధ గ్రహము, కుజ గ్రహము ఒకే రోజు ఒకే నక్షత్రంలో కలుస్తాయి. దీని ద్వారా ఈ ఐదు రాశుల వారు అదృష్టాన్ని పొందుతారు. ఆ ఐదు రాశుల ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
వృషభ రాశి: ఈ రాశి వారికి ఆగస్టు 22 నుండి రాజుయోగం ఏర్పడుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వ్యాపారస్తులు తమ వ్యాపారాన్ని విస్తరించేందుకు విదేశీ పర్యటనలు చేస్తారు. ఎప్పటినుంచో ఇబ్బంది పడుతున్న మానసిక సమస్యల నుంచి బయటపడతారు. ఉద్యోగస్తులకు ప్రమోషన్ లభిస్తుంది విద్యార్థులు కోరుకున్నారు. కెరీర్ లో ముందుకు వెళ్తారు కుటుంబ సభ్యులతో మంచి సంబంధాలను కలిగి ఉంటారు.
వృశ్చిక రాశి: ఈ రాశి వారికి కుజుడు ,శుక్రుడు కలయిక వల్ల అంత శుభప్రదంగా జరుగుతుంది. మీరు చేపట్టిన ప్రతి పనిలో కూడా విజయాన్ని సాధిస్తారు. మీ వ్యాపార రంగంలో లాభాలు కూడా పెరుగుతాయి. పెట్టుబడి నుంచి మంచి లాభాలు పొందుతారు. ప్రైవేటు ఉద్యోగస్తులకు ప్రమోషన్ లభిస్తుంది. ఎప్పటినుంచో కోర్టులో పెండింగ్లో ఉన్న సమస్య తీరిపోతుంది నూతన గృహాన్ని కొనుగోలు చేస్తారు.
మేష రాశి: ఈ రాశి వారికి శుక్రుడు ,కుజ గ్రహం ఆశీస్సులతో చేపట్టిన పనులు పూర్తి కాగలవు. డబ్బుకు సంబంధించిన సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. వ్యాపారంలో అధిక లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఆర్థికంగా కూడా ఎటువంటి నష్టాలు జరగవు. ఆరోగ్య సమస్యలు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టవు. కుటుంబ సభ్యులతో విహారయాత్రలకు వెళ్లే అవకాశం ఉంది. విద్యార్థులు కోరుకున్న రంగంలో ఉద్యోగాలు చేస్తారు.
తులారాశి: ఈ రాశి వారికి ఆర్థికంగా ఎటువంటి లోటు ఉండదు. భవిష్యత్తులో మీ ఆర్థిక పరిస్థితి ఇంకా బలోపేతం అవుతుంది. ఆగస్టు 22 నుంచి మీ కెరీర్ లో కోరుకున్న రంగంలో దూసుకెళ్తారు. వ్యాపారంలో ఆశించిన దానికంటే కూడా ఎక్కువ లాభాలు పొందుతారు. ఎప్పటినుంచో ఇబ్బంది పెడుతున్న రుణ సమస్యల నుంచి విముక్తి పొందుతారు.
మీన రాశి: నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగాలు లభిస్తాయి. ఆర్థికంగా బలోపేతం అవుతారు. కొత్త ఆస్తులను కొనుగోలు చేస్తారు. వ్యాపారాన్ని విస్తరిస్తారు కుటుంబ సభ్యులతో కలిసి విదేశీయానం ఉంటుంది. ఎత్తైన ప్రదేశాలకు వెళ్ళకండి. ఎప్పటినుంచో ఇబ్బంది పెడుతున్న అనారోగ్య సమస్య నుంచి బయటపడతారు.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం మత విశ్వాసాల ఆధారంగా పేర్కొనడం జరిగింది. జ్యోతిష్యం, జాతకం విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు.