astrology

ఒకే రోజు వంద సంవత్సరాలు తర్వాత ఏకకాలంలో నాలుగు యోగాలు ఒకేసారి ఏర్పడుతున్నాయి.  విష్ణుమూర్తి అనుగ్రహము ఈ 12 రాశుల వారు పొందుతారు. అందులో ముఖ్యంగా ఈ మూడు రాశుల వారికి ఎక్కువ శుభలు జరిగే అవకాశాలు ఉన్నాయి. జూలై 17 ఈరోజు రాత్రి 7 గంటలకు శుభయోగం ఏర్పడుతుంది. అదేవిధంగా సాయంత్రం 5గంటలకు శుకల యోగం ఏర్పడుతుంది. ఇదే రోజు సాయంత్రం 5గంటల 40 నిమిషాలకు అమృతసిద్ధి యోగం ఏర్పడుతుంది. ఇదే రోజు సాయంత్రం 5గంటల 55 నిమిషాలకు సర్వార్ధ సిద్ధియుగం ఏర్పడుతుంది. ఏకకాలంలో ఈ నాలుగు యోగాలు ఏకాదశి రోజున ఏర్పడడం 100 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. దీనివల్ల మూడు రాశుల వారు చాలా శుభ ఫలితాలను పొందుతారు. ఆ మూడు రాశుల ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

మేష రాశి: ఈ రాశి వారికి శ్రీమహావిష్ణువు కటాక్షం ఎప్పటికీ ఉంటుంది. మీరు ఏ పనికి చేపట్టిన త్వరగా పూర్తి చేస్తారు. పనిలో ఆటంకాలు రావు. ప్రతి పనిలోనూ విజయాలు సాధిస్తారు. ఉద్యోగంలో ప్రమోషన్ లభిస్తుంది. నూతన పెట్టుబడులు పెడతారు.

కర్కాటక రాశి: ఈ రాశి వారు పూర్వీకుల నుండి ఆస్తిని పొందుతారు. శుభకార్యాలలో పాల్గొంటారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. రుణ బాధల నుండి విముక్తి పొందుతారు .శ్రీమహావిష్ణు ఆశీర్వాదం వల్ల వ్యాపారంలో లాభాలు వస్తాయి. ఉద్యోగాల్లో కూడా ప్రమోషన్ లభిస్తుంది. కోర్టు వ్యవహారాల నుండి బయటపడతారు నూతనంగా గృహము కారును కొనుక్కుంటారు.

కుంభరాశి: ఈ రాశి వారికి పనులన్నీ కూడా చక చక జరిగిపోతాయి. కుటుంబంలో కొన్ని శుభవార్తలను వింటారు. వ్యాపారంలో పురోగతి ఉంటుంది. ఉద్యోగులకు పదోన్నతి లభిస్తుంది. మీ జీతభత్యాలు పెరిగే అవకాశాలు చాలా ఉన్నాయి. ఆరోగ్యం కూడా సహకరిస్తుంది. ఎప్పటినుంచో ఇబ్బంది పడుతున్న రుణ బాధల నుండి విముక్తి పొందుతారు. శ్రీమహావిష్ణు యొక్క విశేష ఆశీస్సులు మీపైన ఎప్పుడు ఉంటాయి.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం మత విశ్వాసాల ఆధారంగా పేర్కొనడం జరిగింది. జ్యోతిష్యం, జాతకం విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు.