astrology

జులై 19వ తారీకు రాత్రి నుండి త్రీగ్రాహీయోగం ముగిస్తుంది. ఈ 20 నుండి ఈ ఐదు రాశుల వారికి కష్టాలు పెరుగుతాయి. ఆర్థికంగా నష్టపోవడమే కాకుండా ఆరోగ్యపరమైన సమస్యలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. రాబోయే రోజుల్లో ఈ ఐదు రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి. ఆ ఐదు రాశులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

మిధున రాశి: ఈ రాశి వారికి యజమానులతో గొడవపడే అవకాశం ఉంది. మానసికంగా ఇబ్బంది పడతారు. ఆరోగ్యం పైన కూడా ప్రభావాలు చూపిస్తాయి. ముఖ్యంగా మీ ఇంట్లో ఉన్న తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. లేకపోతే వారి ఆరోగ్యం క్షమించవచ్చు. వాహన ప్రయాణాలు చేసే వాళ్ళు జాగ్రత్తగా నడపండి. ఆక్సిడెంట్లు అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి.

Vastu Rules For TV: వాస్తు ప్రకారం ఇంట్లో టీవీ ఏ దిక్కులో ఉండాలో తెలుసా ...

మేషరాశి: ఈ రాశి వారికి కుటుంబంలో గొడవలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. వివాహితులు తమ జీవిత భాగస్వామితో అనవసరంగా గొడవకు దిగుతారు. అది మానుకోవాలి లేకపోతే మీ కుటుంబ జీవితమైన జీవితం పైన ప్రతికూల వాతావరణం ఏర్పడుతుంది. ప్రేమ వివాహం చేసుకునేవారు ఆచితూచి అడుగు వేయాలి. ప్రేమ వివాహాలు విఫలమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కోర్టు సంబంధ సమస్యలు ఇంకా తీవ్రంగా ఇబ్బంది పెడతాయి.

కర్కాటక రాశి: ఈ రాశి వారు ఉద్యోగం చేసే దగ్గర సీనియర్లతో జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు పరీక్షల్లో ఫెలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. విద్యార్థులు ఆహారపు అలవాట్లను నియంత్రించుకోవాలి లేకపోతే కడుపుకు సంబంధించిన సమస్యలు రావచ్చు వ్యాపారంలో సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. దీని కారణంగా మానసికమైన ఒత్తిడి ఏర్పడుతుంది. దీని ద్వారా కుటుంబంలో ఇబ్బందులు పడే అవకాశం ఉంది.

వృశ్చిక రాశి: కళలకు సంబంధించిన వ్యక్తులైతే మానసిక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.ఇది వారి ఆరోగ్యం పైన కూడా తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. ఉద్యోగస్తులు పని ఒత్తిడి ఎదుర్కోవాల్సి వస్తుంది. వ్యాపారస్తులు తమ లావాదేవీల్లో జాగ్రత్తగా ఉండాలి లేకపోతే ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. వివాహితులు కూడా కుటుంబ సమస్యలతో ఇబ్బందికి గురవుతారు.

ధనస్సు రాశి: ఈ రాశి వారు వ్యాపారం చేసేటప్పుడు ఒకటికి పది సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ప్రభుత్వ ఉద్యోగులు వారిపై అధికారులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే విభేదాలు తలెత్తే అవకాశాలు చాలా ఉన్నాయి అప్పుల బాధ ఎక్కువ అవుతుంది. రావాల్సిన మొండిబకాయలు ఇంకా ఇబ్బంది పెడుతూ ఉంటాయి.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం మత విశ్వాసాల ఆధారంగా పేర్కొనడం జరిగింది. జ్యోతిష్యం, జాతకం విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు.