ఆగస్టు 16నుంచి సూర్యుడు ,శని గ్రహం ఒకే రాశిలోకి ప్రవేశం.ఇది మొత్తం 12 రాశుల మీద ప్రభావాన్ని చూపిస్తుంది. ఇది ముఖ్యంగా ఈ ఐదు రాశుల వారికి ప్రయోజనం చేకూర్చే విధంగా ఉంటుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 30 సంవత్సరాల తర్వాత సూర్యుడు ,శని ఒకే రాశిలోకి ప్రవేశం దీనిద్వారా ఈ ఐదు రాశుల వారికి రాజయోగం ఏర్పడుతుంది ఆ ఐదు రాశులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
వృషభ రాశి: ఈ రాశి వారికి శని ,సూర్యుడి గ్రహాలు కలయిక వల్ల ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు, మీ వ్యాపారంలో పురోగతి పొందుతారు, చేపట్టిన ప్రతి పనిలో కూడా విజయాన్ని సాధిస్తారు, ఆర్థికంగా ఎటువంటి నష్టాలు ఉండవు, మీ వ్యాపారాన్ని విస్తరించేందుకు అనువైన సమయం.
మిథున రాశి: ఈ రాశి వారికి శుభకార్యాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.మీ ఆదాయం పెరగవచ్చు. రాబోయే రోజుల్లో మీకు ఉద్యోగ ఉన్నతి లభిస్తుంది. ప్రేమ వివాహాలకు అనుకూలం. కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతారు, మీ వ్యాపారాన్ని విస్తరించేందుకు విదేశాలకు వెళ్లే ప్రయత్నాలు సఫలం అవుతాయి.
Astrology: మీ అరచేతిపై ఈ గీత ఉంటే గుండెకు ప్రమాదం,
మేష రాశి: ఈ రాశి వారికి చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. చాలా రోజుల నుంచి ఇబ్బంది పడుతున్న అనారోగ్య సమస్య నుంచి ఉపశమనం పొందుతారు, చేపట్టిన ప్రతి వ్యాపారంలోనూ విజయాన్ని సాధిస్తారు. ఉద్యోగస్తులకు ఉద్యోగంలో పదోన్నతి లభిస్తుంది. విద్యార్థులకు చక్కటి ఫలితాలు వస్తాయి. తల్లిదండ్రులు మీతో ప్రేమగా ఉంటారు. కోర్టులో పెండింగ్లో ఉన్న సమస్య నుంచి బయటపడతారు.
తులారాశి: ఈ రాశి వారికి మంచి రోజులు ప్రారంభం కానున్నాయి, మీ ఆస్తి పెరుగుతుంది.జీవితం భాగస్వామితో దూర ప్రయాణాలకు విహారయాత్రలకు వెళ్లే అవకాశం ఉంది.చాలా కాలంగా ఇబ్బంది పెడుతున్న సమస్యల నుంచి పరిష్కారం అవుతాయి. దీని ద్వారా మీరు మానసిక ప్రశాంతతను పొందుతారు.ఎప్పటినుంచో అనుకుంటున్నా పనులు పూర్తవుతాయి, ఆర్థిక పరిస్థితి చాలా మెరుగుపడుతుంది, వ్యాపారంలో లాభాలు పొందుతారు, నూతన గృహాన్ని కొనుగోలు చేస్తారు.
మీన రాశి: ఈ రాశి వారికి డబ్బు సంపాదించడానికి కొత్త కొత్త అవకాశాలు ఏర్పడతాయి, ఎప్పటినుంచో పెండింగ్లో ఉన్న పనులు కూడా పూర్తి చేస్తారు.మీరు గనక వ్యాపారం చేయాలనుకున్నట్లైతే పెట్టుబడులు పెట్టడానికి వెనకాడకండి. ఇది చాలా మంచి సమయం. ఈనెల మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. సమాజంలో గౌరవము పెరుగుతుంది. కోర్టులో పెండింగ్లో ఉన్న ఆస్తి వ్యవహారాల సమస్య నుండి కూడా బయటపడతారు. ప్రేమ వివాహాలకు అనుకూలం.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం మత విశ్వాసాల ఆధారంగా పేర్కొనడం జరిగింది. జ్యోతిష్యం, జాతకం విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు.