astrology

జ్యోతిష్య శాస్త్రంలో బుధ గ్రహానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఆగస్టు 5 నుండి బుధుడు సింహరాశిలోకి తిరోగమనం చేస్తాడు. ఈ బుధ గ్రహ తిరోగమన వల్ల కొన్ని రాశుల వారికి అదృష్టం కలుగు కలిసి వస్తుంది. వారు కెరీర్ లో ముందుకు సాగుతారు ఆర్థికపరమైన ప్రయోజనాలు పొందుతారు. బుధుడు తిరోగమన కదలిక వల్ల అదృష్టం పొందే ఆ ఐదు రాశులు ఏంటో తెలుసుకుందాం.

మిథున రాశి: ఈ రాశి వారికి బుధ గ్రహం అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది. కొత్తగా చేపట్టిన పనుల్లో విజయాన్ని సాధిస్తారు. మీ కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం ఏర్పడుతుంది. ఉద్యోగస్తులు పై అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు. మానసికంగా దృఢంగా ఉంటారు ఎప్పటినుంచో పెండింగ్లో ఉన్న కోర్టు పనులు కోర్టు వ్యవహారాల నుండి విముక్తి పొందుతారు.

తులారాశి: ఈ రాశి వారికి రాజయోగం ఏర్పడబోతుంది. విద్యార్థులు తమకు నచ్చిన రంగాల్లో అడ్మిషన్ పొందుతారు. కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. జీవిత భాగస్వామితో ఆహ్లాదకరంగా గడుపుతారు. విహారయాత్రలకు వెళ్లే అవకాశాలు చాలా ఉన్నాయి. నూతన వాహనాలను కొనుగోలు చేస్తారు. మీరు భవిష్యత్తులో పెట్టబోయే వ్యాపారంలో అదృష్టం వరిస్తుంది.

వృశ్చిక రాశి: ఈ రాశి వారికి ఆర్థిక ప్రయోజనం చాలా అధికంగా ఉంటుంది. ప్రైవేటు ఉద్యోగస్తులకు ప్రమోషన్లు లభిస్తాయి. మీ వ్యాపారాన్ని విస్తరిస్తారు. బుధుడి తిరోగమనం వల్ల మీకు ఆర్థికంగా ఎటువంటి లోటు ఉండదు. ప్రేమ వివాహాలు చేసుకుంటే వారికి ఎంతో అనుకూలంగా ఉంటుంది.

Health Tips: నానబెట్టిన ఎండు ద్రాక్ష మరో వయాగ్రాలా పనిచేస్తుందా..

కన్యా రాశి: బుధుడు తిరోగమనడం వల్ల ఈ రాశి వారు అనేక ప్రయోజనాలను పొందుతారు. మీకు త్వరలోనే మంచి కంపెనీలో పని చేసే అవకాశం లభిస్తుంది. వ్యాపారస్తులకు ఆకస్మికంగా ధన ప్రాప్తి ఉంటుంది. ఎప్పటినుంచో ఇబ్బంది పడుతున్న రుణ బాధ నుండి విముక్తి పొందుతారు. విదేశీ పర్యటనలు చేస్తారు తల్లిదండ్రులతో ఆనందంగా గడుపుతారు.

మకర రాశి: ఈ రాశి వారికి కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది రాబోయే రోజుల్లో వ్యాపారస్తులకు మంచి అవకాశాలు వస్తాయి. మీకు త్వరలోనే ప్రభుత్వ ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది బయటపడతారు. ఆరోగ్యపరంగా ఎటువంటి సమస్యలు ఉండవు. తల్లిదండ్రులు మీ పురోగతి చూసి ఆనందపడతారు. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం మత విశ్వాసాల ఆధారంగా పేర్కొనడం జరిగింది. జ్యోతిష్యం, జాతకం విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు.