astrology

జూలై 16 నుండి ఆగస్టు 16 వరకు సూర్యుడు కర్కాటక రాశిలో సంచరిస్తాడు. రుచిక యోగం  ప్రారంభమవుతుంది. ఇది చాలా శుభప్రదం. ఇది శుభకార్యాలు చేయడానికి చాలా అనుభవం ఉంటుంది. అంతేకాకుండా ఈ ఐదు రాశుల వారికి ఈ యోగం సంతోషాన్ని కలిగిస్తుంది. ఇప్పుడు ఐదు రాశులు తెలుసుకుందాం

సింహరాశి:  ఈ రాశి వారికి వ్యాపారంలో డబ్బు సంపాదించడానికి ఇదే చాలా అనువైన సమయం. మీరు కొత్తగా వ్యాపారం మొదలు పెట్టడానికి ఈ నెలలో ప్రారంభిస్తే మీకు అద్భుత ఫలితాలు లభిస్తాయి. భవిష్యత్తులో మీకు అనేక లాభాలు వ్యాపారంలో వచ్చే అవకాశాలు ఉన్నాయి. గత కొన్ని రోజులుగా ఇబ్బంది పెడుతున్న మీ ఆరోగ్య సమస్య ఇప్పుడు తగ్గిపోతుంది .కుటుంబంతో హాయిగా గడుపుతారు.

మకర రాశి : ఈ రాశి వారికి ఈనెల చాలా అద్భుతంగా ఉండబోతుంది. ఎప్పటినుంచో పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ సక్రమంగా పూర్తవుతాయి. మీకు సమాజంలో గౌరవము పెరుగుతుంది. ఎప్పటినుంచో ఇబ్బంది పడుతున్న అప్పుల బాధ నుండి బయటపడతారు. నూతన గృహాన్ని కొనుగోలు చేస్తారు.

కుంభరాశి:  ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న కోర్టు పనులన్నీ పూర్తి అవుతాయి. విజయం సాధిస్తారు ఉద్యోగంలో ప్రమోషన్ లభించే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారవేత్తలకు ఈనెల చాలా శుభకరంగా ఉంటుంది. శుభకార్యాలలో పాల్గొంటారు. తాత ముత్తాతల నుండి రావాల్సిన ఆస్తి మీకు సంక్రమిస్తుంది.

వృషభ రాశి:  ప్రైవేట్ ఉద్యోగస్తులకు ప్రమోషన్ లభిస్తుంది. షేర్ మార్కెట్లో ఉన్న వారికి ఆర్థికంగా బలంగా ఉంటారు .వ్యాపారులకు

ఎప్పటినుంచో డబ్బు కొరత ఉన్నప్పటికీ ఈ నెలలో చాలా ఉపశమనాన్ని పొందుతారు. మీ పనిలో పురోగతి ఉంటుంది. కుటుంబంతో విదేశీయానం ఉంటుంది. ఆర్థిక ఇబ్బంది నుండి బయట పడతారు .

తులారాశి : కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ఈనెల చాలా అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక సంబంధమైన డీల్ను ఖరారు చేసుకోవడానికి ఇది సరైన సమయం. విద్యార్థులకు పోటీ పరీక్షల్లో ఉత్తమమైన ర్యాంకులు వస్తాయి. ఎప్పటినుంచో ఇబ్బందుల్లో ఉన్న మేము వ్యాపారం పురోగతి ఉంటుంది. ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. కోర్టు సమస్యల నుంచి బయటపడతారు. జీవిత భాగస్వామితో సమయాన్ని గడుపుతారు. విదేశాలకు వెళ్లేటువంటి ఛాన్స్ ఉంది.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం మత విశ్వాసాల ఆధారంగా పేర్కొనడం జరిగింది. జ్యోతిష్యం, జాతకం విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు.