జ్యోతిష శాస్త్రం ప్రకారం జూలై 25 నుంచి ఆగస్టు 16న సూర్యుడు సింహరాశిలోకి ప్రవేశిస్తాడు. దీని కారణంగా సూర్యుడు శని కలయిక కారణంగా కొన్ని రాశుల వారు సమస్యలను ఎదుర్కొనవలసి వస్తుంది. ముఖ్యంగా ఈ ఐదు రాశుల వారికి ఇబ్బందులు ఎదుర్కొనవలసి వస్తుంది. ఆ రాశులు ఏంటో తెలుసుకుందాం.
తులారాశి: ఈ రాశి వారికి ఈ రోజు నుండి ఆగస్టు 16 వరకు ఇబ్బందులను ఎదుర్కొంటారు. తీసుకునే ఆహారం పైన ప్రత్యేక శ్రద్ధ వహించాలి. లేకపోతే ఫుడ్ పాయిజన్ అయ్యేటటువంటి అవకాశాలు చాలా ఉన్నాయి. దీని వల్ల మీ ఆరోగ్యం క్షీణిస్తుంది. ఉద్యోగస్తులు మానసికంగా ఇబ్బంది. పడతారు మీ పై అధికారుల నుండి కొంత ఇబ్బందిని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇంట్లో తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల శ్రద్ధగా ఉండాలి. ఎవరి వ్యక్తిగత వ్యవహారాల్లో జోక్యం చేసుకోకూడదు. దీనివల్ల గొడవలు పెరిగే అవకాశాలు చాలా ఉన్నాయి.
సింహరాశి: సినిమా రంగంలో పని చేసేవారు నిర్ణయాలు తీసుకోవడంలో తొందర పడకూడదు. దీనివల్ల ఆర్థిక నష్టం పరువు నష్టం ఏర్పడే అవకాశం ఉంది. వ్యాపారులకు కొంత సవాలుగా ఉండేటువంటి సమయం చిన్నచిన్న నిర్ణయాలు కూడా ఆలోచించి తీసుకోండి. లేకపోతే వ్యాపారంలో నష్టం చవిచూడాల్సి వస్తుంది. దీనివల్ల ఒత్తిడి అనారోగ్య సమస్యలు పెరుగుతాయి.
Health Tips: జామపండు తింటే కలిగే ఉపయోగాలు తెలిస్తే...షాక్ తినడం ఖాయం..
వృశ్చిక రాశి: మీరు కొత్తగా కనక ఏదైనా ప్రాజెక్ట్ ను పూర్తిచేయాలనుకున్నట్లయితే కాస్త ఆగాలి. ఎందుకంటే ఈ సమయంలో మీరు దాన్ని పూర్తి చేయలేరు. కాబట్టి వాయిదా వేసుకుంటేనే మంచిది. ఉద్యోగస్తులు శ్రద్ధగా పని చేయాలి లేకపోతే మీ సహోదయోగుల నుండి మీ పై అధికారుల నుండి ఒత్తిడి ఎదుర్కోవాల్సి వస్తుంది. ఖర్చులు అధికంగా పెరుగుతాయి. కోర్టు వ్యవహారాల నుండి ఎటువంటి తీర్పు లభించక ఇంకా ఇబ్బంది పడాల్సి వస్తుంది. నూతన గృహాన్ని కొనుగోలు చేయాలి అనుకున్న వారు వాయిదా వేసుకోవడం మంచిది.
కర్కాటక రాశి: ఈ రాశి వారికి విదేశీ పర్యటనలు ఉంటే రద్దు చేసుకుంటే మంచిది. దూర ప్రయాణాలకు వెళ్లకుండా ఉంటేనే మంచిది. యాక్సిడెంట్లు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. డబ్బు కొరత ఎక్కువగా ఉంటుంది భార్యాభర్తల మధ్య గొడవలు పెరిగే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి.
ధనస్సు రాశి: ఈ రాశి వారికి కుటుంబ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ప్రత్యర్థుల తోటి జాగ్రత్తగా ఉండాలి లేకపోతే ఇబ్బంది పడాల్సి వస్తుంది. వాహన ప్రయాణాలు చేసే వారు జాగ్రత్తగా ఉండాలి.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం మత విశ్వాసాల ఆధారంగా పేర్కొనడం జరిగింది. జ్యోతిష్యం, జాతకం విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు.