శుక్రుడు ప్రస్తుతం పునర్వసు నక్షత్రంలో సంచరిస్తున్నాడు. జూలై 9 నుంచి శుక్రుడు పుష్య నక్షత్రం లోనికి ప్రవేశిస్తాడు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రుడు చాలా శుభప్రదమైన గ్రహంగా అందరూ పేర్కొంటారు. ఈ రాశి మార్పు కారణంగా ఈ మూడు రాశుల వారికి అదృష్టం చాలా కలిసి వస్తుంది. ఆ రాశులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
వృషభ రాశి: ఈ రాశి వారికి వ్యాపారంలో పెద్ద డీల్ జరిగే అవకాశాలు చాలా ఉన్నాయి. ప్రైవేట్ ఉద్యోగాలు మీరు చేస్తున్నట్లయితే మీకు ఇంక్రిమెంట్ బాగా పెరుగుతుంది. అదేవిధంగా ఆఫీసులో మీ బాధ్యతలు కూడా పెరుగుతాయి. ఎప్పటినుంచో మీరు ఇల్లు కొనాలి అనుకుంటున్నా చిరకాల కోరిక నెరవేరుతుంది. వ్యాపారులకు ఆకస్మికంగా ధన లాభం ఉంటుంది. మీరు వ్యాపారం విస్తరించాలి అనుకుంటే ఇదే అనువైన సమయం. కోర్టు వ్యవహారాల్లో ఏమైనా ఇబ్బందులు ఉంటే పరిష్కారం అయ్యేటువంటి అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల సహకారంతో ఆగిపోయిన పనుల్లో ముందడుగు వేస్తారు. మీ కుటుంబంలో ఎప్పుడు సంతోషంగా ఉంటుంది. మీ ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది.
కన్యారాశి: ప్రభుత్వ ఉద్యోగులకు ఇది చాలా మంచి సమయం. మీరు మీ బాస్ నుండి ప్రోత్సాహాన్ని అందుకుంటారు. మీరు ఏదైనా వ్యాపారంలో పెట్టుబడి పెట్టాలనుకుంటే ఇది చాలా శుభ సమయం. షేర్లు కొనేటప్పుడు పెద్ద కంపెనీ షేర్లను కొనుగోలు చేయడం ద్వారా మీకు చాలా ప్రయోజనం ఉంటుంది. మీరు కొత్త ఇంటిని నిర్మించాలనుకున్న, కొత్త కారు కొనుక్కోవాలి అనుకున్న ప్రారంభించుకోవచ్చు .మీకు భవిష్యత్తులో వ్యాపారం నుంచి మంచి లాభాలు పొందే అవకాశం ఉంది. మీరు విదేశాలకు వెళ్లేటువంటి అవకాశం కూడా ఉంది. విద్యార్థుల కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది. మీ కుటుంబంలో కూడా ఎప్పుడు ధన ప్రవాహం ఉంటుంది. మీ కుటుంబ సభ్యుల సహకారం మీ పైన ఉంటుంది.
కుంభరాశి: పూజా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. కోరుకున్న వ్యక్తిని వివాహం చేసుకున్నటువంటి అవకాశాలు చాలా ఉన్నాయి. ఎప్పటినుంచో మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. మీరు ఏదైనా వ్యాపారంలో పెట్టుబడి పెట్టాలనుకుంటే ఇది చాలా మంచి సమయం. ప్రైవేట్ ఉద్యోగాలు చేసే వారికి ఇంక్రిమెంట్లు పెరుగుతాయి. మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. సమాజంలో మంచి గుర్తింపు తెచ్చుకుంటారు.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం మత విశ్వాసాల ఆధారంగా పేర్కొనడం జరిగింది. జ్యోతిష్యం, జాతకం విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు.