astrology

సూర్యుడు ఆత్మవిశ్వాసానికి శక్తికి కారణమైన గ్రహంగా చెప్తారు. సమాజంలో గౌరవం సంపదలు పెరగడానికి ఈ సూర్యగ్రహణం సహకరిస్తుంది. అయితే సెప్టెంబర్ 16 నుండి సూర్యుడు కన్యా రాశిలోకి సంచారం. దీని ద్వారా కొన్ని రాశుల్లో ఇబ్బందులు గురి అయ్యే అవకాశం ఉంది. ఆ నాలుగు రాశులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం

వృశ్చిక రాశి: ఈ రాశి వారికి మానసికంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన సమస్యలు పెరుగుతాయి .ఉద్యోగం చేయాలనే కోరిక ఉండదు. మీ పై ఉద్యోగులతో గొడవ పెట్టుకునే అవకాశాలు ఉన్నాయి. కుటుంబంలో కూడా గొడవలు జరిగే ప్రమాదం ఉంది. వ్యాపారంలో నష్టాలు వస్తాయి. ప్రయాణాలలో ఆక్సిడెంట్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. ఎత్తయిన ప్రదేశాలకు వెళ్ళకండి విద్యార్థులకు వాళ్ళ భవిష్యత్తు అగమ్య గోచరంగా ఉంటుంది.

మీన రాశి: ఈ రాశి వారికి వ్యాపారంలో తీవ్ర నష్టాలు ఏర్పడతాయి. కొత్తగా వ్యాపారం చేయాలనుకునేవారు కాస్త ఆగడమే మంచిది. డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థుల అతి విశ్వాసం వల్ల మీ చదువుల పైన తీవ్ర ప్రభావం చూపుతుంది. అంతేకాకుండా మీలో తొందరపాటు నిర్ణయాల వల్ల అనేక ఆర్థిక నష్టాలు జరుగుతాయి. కోర్టు సమస్యలు ఇంకా ఇబ్బందులకు గురిచేస్తాయి. వ్యాపార లావాదేవీల్లో జాగ్రత్తగా ఉండాలి.

హనుమంతుడికి ఇష్టమైన 5 రాశులు ఇవే..

సింహరాశి: ఈ రాశి వారికి భవిష్యత్తులో ఆర్థిక సంక్షోభం పెరగవచ్చు. ఆదాయానికి మించిన ఖర్చులు ఏర్పడతాయి. ఊహించని ఖర్చులతో ఆర్థికంగా ఇబ్బంది పడాల్సి వస్తుంది. వివాహితులకు కష్టాలు పెరుగుతాయి. వ్యాపారంలో లాభాలు అనుకూలంగా ఉండవు దీని ద్వారా మానసికంగా ఒత్తిడికి గురవుతారు.

కన్యారాశి: దంపతుల మధ్య గొడవలు పెరిగే అవకాశం ఉంది ఆరోగ్యపరమైన నష్టాలు పెరుగుతాయి. అనారోగ్యపరంగా కూడా చాలా డబ్బును ఖర్చు చేయాల్సి వస్తుంది. వ్యాపారంలో భారీ నష్టము వస్తుంది. దూర ప్రయాణాలు చేయకండి. మానసిక ఇబ్బందుల వల్ల అది మీ ఆర్థిక స్థితి పైన కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం మత విశ్వాసాల ఆధారంగా పేర్కొనడం జరిగింది. జ్యోతిష్యం, జాతకం విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు.