కుంభ రాశికి ,మకర రాశికి అధిపతి అయిన శని గ్రహం శుభ ఫలితాలను ఇస్తుందని అందరూ నమ్ముతారు. శని గ్రహం రాశి మార్పు సెప్టెంబర్ 2 నుండి అన్ని రాశుల వారికి సానుకూల ప్రభావాలు కనిపిస్తాయి. ముఖ్యంగా ఈ మూడు రాశులు వారికి శుభం కలుగుతుంది. అదృష్టం కలిసి వస్తుంది. ఆ మూడు రాశులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

తులారాశి: ఈ రాశి వారికి శనిగ్రహం రాశి మార్పు కారణంగా వీరిలో సానుకూల ప్రయోజనం ఉంటుంది. వీరు చేపట్టిన పనులు రెండు నెలల్లో పూర్తి అవుతాయి. వ్యాపారస్తులు తమ వ్యాపారాన్ని విస్తరించేందుకు శుభ సమయం. ఉద్యోగరీత్యా విదేశాలకు వెళ్లే అవకాశాలు  లభిస్తుంది. ఉద్యోగస్తులు ఇచ్చిన ప్రాజెక్టు వర్క్ ను విజయవంతంగా పూర్తి చేస్తారు. ఉద్యోగం రానివారు వారికి నచ్చిన సంస్థలో పనిచేసే అవకాశం లభిస్తుంది. నూతన గృహాన్ని కొనుగోలు చేస్తారు. దూర ప్రయాణాలకు విహారయాత్రలకు వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆరోగ్యపరంగా ఎటువంటి చిక్కులు ఉండవు.

మీన రాశి: ఈ రాశి వారికి ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది. శని గ్రహ తన రాశి మార్పు కారణంగా వీరికి చాలా అనుకూలంగా ఉంటుంది. విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. తల్లిదండ్రులతో సంబంధం బాంధవ్యాలు పెరుగుతాయి. మీ కుటుంబ సభ్యులతో పాత ద్వేషాలు తొలగిపోతాయి. వ్యాపారస్తులు విదేశీ కంపెనీలలో పెట్టుబడులు పెడతారు. ప్రేమ వివాహాలకు అనుకూలం. ఎప్పటినుంచో ఇబ్బంది పెడుతున్న అనారోగ్య సమస్య నుంచి బయటపడతారు.

Astrology: బద్రినాథ్ కు అత్యంత ఇష్టమైన 4 రాశులు ఇవే

సింహరాశి: ఈ రాశి వారికి శని గ్రహం రాశి మార్పు కారణంగా మీ కుటుంబంలో కొన్ని శుభవార్తలు వింటారు. ఉద్యోగస్తులకు ఆకస్మికంగా ధన ప్రయోజనాలు పెరుగుతాయి. ఎప్పటినుంచో ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త వింటారు. సాంకేతిక రంగాలు సంబంధించిన వారికి సమాజంలో గౌరవం పెరుగుతుంది. స్టాక్ మార్కెట్లో కొత్త లాభాలు వస్తాయి. మీరు చేసే కొత్త కొత్త ప్రణాళికలు విజయవంతం అవుతాయి. వ్యాపారస్తులు తమ పెట్టుబడులను పెట్టడానికి ఇది శుభ సమయం. రుణ బాధల నుండి విముక్తి పొందుతారు. కోట్లో పెండింగ్ ఉన్న ఆర్థిక సమస్యల నుండి బయటపడతారు వారసత్వ ఆస్తులు వస్తాయి.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం మత విశ్వాసాల ఆధారంగా పేర్కొనడం జరిగింది. జ్యోతిష్యం, జాతకం విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు.