ఈసారి ఆషాడ అమావాస్య జూలై 5 న వచ్చింది. శని కుంభరాశిలో ఉంటూ రాజయోగాన్ని సృష్టిస్తాడు. ఇది కొన్ని రాశుల వారిని ధనవంతులుగా చేసే అవకాశం ఉంది. ఆ రాశులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
మకర రాశి: ఆషాడ అమావాస్యనాడు మిథున రాశి వారికి చాలా శుభప్రదం. వీరికి పదోన్నతి లభించే అటువంటి అవకాశాలు చాలా ఉన్నాయి. సంతానం లేని వారికి సంతానం అయ్యేఅవకాశం ఉంది. వివాహ సంబంధాలకు చాలా అనుకూలంగా ఉంటుంది. అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. వ్యాపారవేత్తలకు వ్యాపారం చాలా లాభదాయకంగా ఉంటుంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగంలో పదోన్నతులు ఏర్పడతాయి.
మిథున రాశి: మిథున రాశి వారికి శని దేవుడి కృప ప్రత్యేకంగా ఉంటుంది. ఈ వ్యక్తులకు అదృష్టం నక్కతోక్కినట్లే ఉంటుంది. ఉద్యోగంలో మీకు ఒక శుభవార్త రావచ్చు. ఆర్థికంగా లాభదాయకంగా ఉంటుంది. ఆఫీసులో అందరి నుండి మీకు సహకారం లభిస్తుంది. ఆరోగ్యపరంగా కూడా ఎటువంటి సమస్యలు ఉండవు.
కుంభ రాశి: ఈ రాశి వారికి శని ప్రస్తుతం తిరుగమనంలో కదులుతున్నాడు. ఈ రాశి వారికి కష్టానికి తగిన ఫలితము పొందుతారు. ప్రైవేటు ఉద్యోగులకు ప్రమోషన్ లభిస్తుంది. మీరు కొన్నటువంటి షేర్లకు లాభం అధికంగా వస్తుంది. నూతన వాహనాలు ఆస్తులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. విదేశాలకు వెళ్లేటువంటి అవకాశాలు విద్యార్థులకు చాలా ఉన్నాయి .పోటీ పరీక్షల్లో ఉత్తమమైన ఫలితాలు వస్తాయి.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం మత విశ్వాసాల ఆధారంగా పేర్కొనడం జరిగింది. జ్యోతిష్యం, జాతకం విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు.