astrology

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి భవిష్యత్తును ఎలా తెలుసుకుంటారో అదే విధంగా సంఖ్య శాస్త్రాన్ని కూడా ఉపయోగపడుతుంది. ఒక వ్యక్తి పుట్టిన తేదీ ప్రకారం వారి గ్రహాలు వారి రాశుల కారణంగా వారి జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. అంతేకాకుండా వారి వారి రాడిక్స్ సంఖ్యను బట్టి వారు భవిష్యత్తులో ఎలా ఉండబోతున్నారో కూడా నిర్ణయించబడుతుంది. రాడిక్స్ సంఖ్య 6 ఉన్న వారికి స్వభావం భవిష్యత్తు గురించి తెలుసుకున్నాం. ఆ తేదీల్లో ఏంటివో ఇప్పుడు తెలుసుకుందాం.

ఏ నెలలో అయినా 6 తారీకు 15వ తారీకు, 24లో తారీకు జన్మించిన వారి రాడిక్స్ సంఖ్య 6 ఉంటుంది. వీరు పుట్టిన తేదీ ఆధారంగా వీరి లక్షణాలు జీవితం గురించి అనేక విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. రాడిక్స్ సంఖ్య 1 నుండి 9 అంకెల వరకు ఉంటాయి. ముఖ్యంగా రాడిక్స్ సంఖ్య 6 ఉన్న వారి లక్షణాలు చూసినట్లయితే వీరు సమాజంలో గౌరవప్రదంగా ఉంటారు. చూడడానికి చాలా అందంగా ఆకర్షణీయంగా కూడా ఉంటారు. వీరు కష్టపడి పని చేసే తత్వం అధికంగా ఉండడం ద్వారా వీరు చిన్న వయసులోనే డబ్బు సంపాదిస్తారు. వీరు సాహిత్య కళల పైన ఎక్కువ మక్కువ చూపుతారు. వీరి ఆర్థిక పరిస్థితి కూడా బాగుంటుంది. మీరు ఆదాయం ఎక్కువగా సంపాదిస్తారు. ఖర్చులు తక్కువగా ఉంటాయి. కష్టపడి పనిచేసే తత్వం అధికంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో ఎల్లప్పుడూ అన్యోన్యంగా ఉంటారు. గౌరవం పెద్దలకు ఇస్తారు. వీరితో ఫ్రెండ్షిప్ చేయడానికి అందరూ కూడా ముందుంటారు.

Astrology: శ్రీకాళహస్తి వాయులింగేశ్వరుడికి ఇష్టమైన 4 రాశులు ఇవే…

రాడిక్స్ సంఖ్య 6 ఉన్నవారు వీరు కళలపైన అదేవిధంగా ఆభరణాలపైన బట్టల పైన మొదలైన వాటిలో పనిచేస్తే వీరికి ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉంటాయి. అంతేకాకుండా వీరు నాటక రంగంలోనూ సంగీతం వైపు ఎక్కువగా ఉంటారు. దీని వల్ల వీరికి సమాజంలో కీర్తి పెరుగుతుంది.శారీరకంగా కూడా వీరు దృఢంగా ఉంటారు. ఆర్థికంగా కూడా వీరు చాలా బలంగా ఉంటారు. ఆరోగ్యం కూడా వీరికి ఎల్లప్పుడూ సహకరిస్తుంది. వీరు బంగారం వెండి వంటి వ్యాపారాలలో పని చేసినట్లయితే వీరు మొదటి స్థానంలో ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం మత విశ్వాసాల ఆధారంగా పేర్కొనడం జరిగింది. జ్యోతిష్యం, జాతకం విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు.