గురుగ్రహం అత్యంత ప్రభావంతమైనది ,అత్యంత శుభకరం. అందుకే ఈ రాశిని దేవతలకు గురువుగా పిలుస్తారు. గురు గ్రహం సెప్టెంబర్ 19వ తేదీన వృషభ రాశి నుండి మిధున రాశిలోకి వెళుతుంది. దీనివల్ల అన్ని రాశులకు ప్రభావితం ఉంటుంది. ముఖ్యంగా ఈ ఐదు రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. చేపట్టిన ప్రతి పనిలో కూడా శుభప్రదం అవుతుంది. ఐదు రాశులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
ధనస్సు రాశి: ఈ రాశి వారికి సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. ఏ పని చేయాలన్న ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళతారు. దీని వల్ల మీ ఆదాయం పెంచడానికి కొత్త మార్గాలను ఎన్నుకుంటారు. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. మీరు చేపట్టిన వ్యాపారంలో అభివృద్ధి ఉంటుంది విద్యార్థులు పై చదువుల పైన దృష్టి పెట్టి మొదటి ర్యాంకును తెచ్చుకుంటారు కుటుంబంలో సంతోషం పెరుగుతుంది.
కన్యా రాశి: ఈ రాశి వారికి ఆదాయం పెరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. మునుపటితో పోలిస్తే మీ ఆర్థిక పరిస్థితి మరింత బలపడుతుంది. ఉద్యోగస్తులకు కోరుకున్న రంగాల్లో ప్రమోషన్ లభించి లభిస్తుంది. వ్యాపారంలో మీ పెట్టుబడులకు తగ్గట్టుగా భారీ లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. రాజకీయ నాయకులకు సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి.
తులారాశి: ఈ రాశి వారికి సానుకూల ప్రభావాలు ఉంటాయి. ఉద్యోగం లేని వారికి కొత్తగా ఉద్యోగం లభించే అవకాశాలు ఉంటాయి. సోషల్ మీడియా మార్కెటింగ్ రంగాల్లో వ్యాపారం చేసే వారికి లాభాలు పెరుగుతాయి. విద్యార్థులకు తమ కోరుకున్న రంగాలలో విజయాన్ని సాధిస్తారు ప్రేమ వివాహాలకు అనుకూలం.
Astrology: శనీశ్వరుడికి అత్యంత ఇష్టమైన 4 రాశులు ఇవే
మేషరాశి: ఈ రాశి వారికి మానసికంగా ఉన్న సమస్యలు తొలగిపోతాయి. ఖర్చులు తగ్గి ఆదాయం పెరుగుతుంది. ఆకస్మికంగా ధన లాభం పొందుతారు. మీరు చేసే ప్రతి పని కూడా గుర్తింపు లభిస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలు బలపడతాయి. మీ వ్యాపారంలో పెరుగుదల ఉంటుంది. నూతన గృహాన్ని కొనుగోలు చేస్తారు.
ధనస్సు రాశి: ఈ రాశి వారికి ఉద్యోగాలలో ప్రమోషన్ పెరుగుతుంది. మీ వ్యాపార విస్తరణకు ఇది మంచి సమయం. దీని ద్వారా మీ బ్యాంకు బ్యాలెన్స్ పెరుగుతుంది. విద్యార్థులు పోటీ పరీక్షలో ఉన్నత విజయాన్ని సాధిస్తారు. ఆరోగ్యం కుదుటపడుతుంది. పూర్వికులు నుండి రావాల్సిన ఆస్తి వస్తుంది. దీనివల్ల మానసిక ఆందోళనలు తొలగిపోతాయి. మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. నిరుద్యోగ యువతకు ఉద్యోగం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీని ద్వారా మీ ఆర్థిక సంక్షోభానికి పరిష్కారం లభిస్తుంది.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం మత విశ్వాసాల ఆధారంగా పేర్కొనడం జరిగింది. జ్యోతిష్యం, జాతకం విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు.