జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జులై 1 తేదీన బుధుడు పుష్య నక్షత్రంలోనికి ప్రవేశిస్తాడు. ఒక వారం తర్వాత అంటే జూలై 9 న మళ్లీ బుధ గ్రహం ఆశ్లేష నక్షత్రం లోనికి ప్రవేశిస్తుంది. అంటే ఈ వారం రోజుల్లో ఈ ఐదు రాశుల వారికి అఖండమైన కీర్తి, సంపద ,ఆనందం శ్రేయస్సు కూడా పొందుతారు. బుధ గ్రహం అనుగ్రహంతో ఈ 5 రాశుల  వారు ధనవంతులు అవుతారు.ఆ  5 రాశుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

సింహరాశి: మీరు పూజా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నట్లయితే మీకు కుటుంబంలో సంతోషం ఎప్పడూ ఉంటుంది.  సమాజంలో గౌరవం కూడా పెరుగుతుంది. విదేశాలలో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నట్లయితే మీకు ఆ ఉద్యోగం త్వరలోనే లభిస్తుంది. వ్యాపారస్తులు మీరు పెద్ద మొత్తంలో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లైతే దాని ద్వారా మీకు భారీ లాభాలు వస్తాయి. విద్యార్థులు ఏదైనా పోటీ పరీక్షల్లో పాల్గొన్నట్లయితే వారికి విజయం సాధించేటువంటి అవకాశం చాలా ఉంది.

మేష రాశి: ఈ రాశి వారు త్వరలోనే ఒక శుభవార్త వింటారు. మీకు ఉద్యోగంలో ప్రమోషన్ లభిస్తుంది. షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తే మీకు అవి ధనవంతులుగా మార్చే అవకాశం ఉంది. నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు. రావాల్సిన మొండి బకాయిలు నుండి డబ్బులు తిరిగి వస్తాయి. ఉద్యోగంలో ప్రమోషన్ ని పొందుతారు.

వృషభ రాశి: పెళ్లయి చాలా సంవత్సరాలైనా సంతానం లేని దంపతులకు సంతానం కలిగే అవకాశం ఉంది. మీ ఇంట్లో శుభకార్యాలు జరగవచ్చు. మీకు గవర్నమెంట్ ఉద్యోగం చేసే అవకాశం లభిస్తుంది. మీరు ఐరన్ కు సంబంధించిన బిజినెస్ చేస్తున్నట్లయితే మీకు ఆదాయం చాలా బాగా పెరుగుతుంది.

వృశ్చిక రాశి: ఈ వృశ్చిక రాశి వారు మీరు ప్రభుత్వ ఉద్యోగంలో ఉంటే మీకు ప్రమోషన్ పెరిగి గతంలో కంటే ఆర్థికంగా చాలా బలంగా ఉంటారు. ప్రేమ వివాహం జరిగే అటువంటి అవకాశాలు చాలా ఉన్నాయి. భార్య భర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. కుటుంబంలో పెద్దల నుండి మీకు సహాయ సహకారాలు అందుతాయి. తాత ముత్తాతల నుండి  ఆస్తులు మీకు లభిస్తాయి.

కుంభరాశి: ఈ రాశి వారికి ఎప్పటినుంచో ఉన్నటువంటి రుణాల నుండి విముక్తి అనేది లభిస్తుంది. మీ బ్యాంక్ బ్యాలెన్స్ అమాంతంగా పెరుగుతుంది. సమాజంలో కీర్తిని పొందుతారు. చాలా కాలంగా ఉద్యోగం మారాలనుకున్న వారికి ఇదే మంచి సమయం. త్వరలోనే మీరు ఒక శుభవార్త వింటారు. వ్యాపారులకు ఆకస్మికంగా ధన లాభం. మీరు బట్టల షాపు , ఫుడ్ ఇండస్ట్రీ ఉన్నట్లయితే మీకు లాభాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం మత విశ్వాసాల ఆధారంగా పేర్కొనడం జరిగింది. జ్యోతిష్యం, జాతకం విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు.