astrology

ఆగస్టు 26 కృష్ణాష్టమి. కృష్ణుని అనుగ్రహం పొందడానికి ఈ వస్తువులను సమర్పిస్తే మీకు ఖచ్చితంగా సానుకూల ఫలితాలు లభిస్తాయి. ఆ కృష్ణ పరమాత్ముని అనుగ్రహం ఎల్లప్పుడూ మీపై ఉంటుంది.  మీరు ఐశ్వర్యాలు పొందుతారు. ఏ రాశి వారు ఏ వస్తువులు కృష్ణునికి సమర్పిస్తే కలిసి వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.

మీన రాశి- మీన రాశి వారు కృష్ణాష్టమి రోజున ఎర్రటి వస్త్రాలను, వెన్నను శ్రీకృష్ణునికి సమర్పిస్తే మీ కోరుకున్న కోరికలు తీరి అదృష్టం కలిసి వస్తుంది.

కర్కాటక రాశి-ఈ రాశి వారు శ్రీకృష్ణునికి తేల్లని వస్త్రాలు, చందనం, వెన్న, వెండి వస్తువులు సమర్పించడం ద్వారా మీకు శుభం కలుగుతుంది.

 మేష రాశి- ఈ రాశి వారు శ్రీకృష్ణునికి చందనం, పెరుగు, పసుపు రంగు దుస్తులు సమర్పించడం ద్వారా మీకు దురదృష్టం తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది.

మిథున రాశి- ఈ రాశి వారికి శ్రీకృష్ణుడికి పాలు ,తెల్లటి పువ్వులు సమర్పిస్తూ ఏలినాటి శని పోయి అదృష్టం కలిసి వస్తుంది.

Astrology: శనీశ్వరుడికి అత్యంత ఇష్టమైన 4 రాశులు ఇవే

సింహరాశి- కృష్ణాష్టమి పండుగ రోజున కృష్ణునికి పూజ చేసి ఆకుపచ్చని వస్త్రాలు తులసి దళాలు సమర్పించినట్లయితే ఆ కృష్ణుని యొక్క కృప మీపై ఎల్లప్పుడూ ఉంటుంది.

వృశ్చిక రాశి- ఈ రాశి వారు శ్రీకృష్ణులకి నీలిరంగు దుస్తులు సమర్పించి వెన్నను సమర్పించినట్లయితే ఇది మీకు శుభాన్ని కలిగిస్తుంది.

కన్య రాశి- ఈ రాశి వారు శ్రీకృష్ణునికి పూజ చేసుకొని కృష్ణాష్టమి రోజున కృష్ణునికి ఎర్రని వస్త్రాలు, ఎర్రటి పువ్వులు, పిండి వంటలు, పెరుగు నైవేద్యంగా పెడితే ఆ కృష్ణ పరమాత్ముని అనుగ్రహాన్ని ఎప్పటికీ పొందుతారు.

మకర రాశి- ఈ రాశి వారు శ్రీకృష్ణ కృష్ణుడికి పసుపు రంగు బట్టలు, స్వీట్ లను సమర్పిస్తే మీకు శుభం కలుగుతుంది.

తుల రాశి-ఈ రాశి వారు కృష్ణునికి నారింజ రంగు దుస్తులు, సమర్పించి పంచదార చిలకలు సమర్పిస్తే ఇది మీకు చాలా శుభాన్ని కలిగిస్తుంది.

కుంభరాశి- కుంభ రాశి వారు క్రిస్టియానికి పూజ చేసి ఊదా రంగు బట్టలు ,పెరుగు, వెన్నను, సమర్పిస్తే మీకు శుభం కలుగుతుంది.

వృషభ రాశి- జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ రాశి వారు శ్రీకృష్ణుడికి గులాబీ రంగు దుస్తులు, వెన్న, పంచదార, చందనాన్ని సమర్పిస్తే మీకు శుభం కలుగుతుంది.

ధనుస్సు రాశి-  జన్మాష్టమి రోజున శ్రీకృష్ణునికి ఎర్రని వస్త్రాలు, ఆవు పేడ పిండివంటలు, పెరుగు నైవేద్యంగా సమర్పించి భగవంతుని నుండి విశేష ఆశీస్సులు పొందుతారు.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం మత విశ్వాసాల ఆధారంగా పేర్కొనడం జరిగింది. జ్యోతిష్యం, జాతకం విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు.