astrology

బుధుడు ,కుజ గ్రహానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ రెండు గ్రహాలు కూడా తమ రాశి  మార్చుకుంటాయి. ముఖ్యంగా అక్టోబర్ 1న బుధుడు కుజగ్రహం కలయిక వల్ల సానుకూల ప్రభావాలు ఉంటాయి. అయితే ముఖ్యంగా ఈ మూడు రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది.

మీన రాశి- తులారాశిలోకి శుక్రుడు కుజ గ్రహం కలయిక వల్ల ఈ రాశి వారికి చాలా శుభం జరుగుతుంది. ధన సంపాదనకు ఎదురైన అనేక సమస్యలను పరిష్కారం అవుతాయి. మీరు కష్టానికి తగిన ఫలితాలు లభిస్తాయి. దీని ద్వారా మీ మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో కలిసి విహారయాత్రలకు వెళతారు. ప్రేమ జీవితం ఆనందంగా ఉంటుంది. కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది. ఉద్యమంలో ప్రమోషన్లు కూడా లభిస్తాయి. విద్యార్థులు విదేశాల్లో చదువుకోవడానికి అనుకూలమైన సమయం.

Astrology: గురువారం లక్ష్మీదేవికి ఇలా పూజ చేస్తే మీరు కోటీశ్వరులు .

కన్యారాశి- ఈ రాశి వారికి బుధుడు ,కుజుడు కలయిక వల్ల ఈ రాశి వారికి అదృష్టం వస్తుంది. ఉద్యోగంలో ఉన్న వారికి ఉన్నతాధికారుల నుండి ప్రశంసలు పొందుతారు. దీనితో మీ జీతం పెరుగుతుంది. దీని ద్వారా మీ ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగం లభిస్తుంది. మీ ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. నూతన గృహాన్ని కొనుగోలు చేస్తారు. విదేశాలలో పర్యటనకు మీకు అవకాశాలు లభిస్తుంది.

కుంభరాశి- ఈ రాశి వారికి  కుజుడు, బుధుని కలయిక వల్ల అంతా శుభ ఫలితాలు ఉంటాయి. ఎప్పటినుండ పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా పూర్తవుతాయి. దీని ద్వారా మేము ఉన్నతాధికారులు సంతోషిస్తారు. యువతకు కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది పోటీ పరీక్షల్లో మంచి ఫలితాలు వస్తాయి.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం మత విశ్వాసాల ఆధారంగా పేర్కొనడం జరిగింది. జ్యోతిష్యం, జాతకం విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు.