astrology

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కుజుడు చాలా ముఖ్యమైన గ్రహం. సెప్టెంబర్ 10న మధ్యాహ్నం 12 గంటలకు మృగశిర నక్షత్రం నుండి ఆరుద్ర నక్షత్రంలోనికి ప్రవేశిస్తాడు దీనివలన అన్ని రాశులు ప్రభావితం అవుతాయి. ముఖ్యంగా ఈ మూడు రాశుల వారికి అదృష్టం బంగారం లాగా పడుతుంది. ఆ మూడు రాశులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

కుంభరాశి: ఈ రాశి వారికి కుజ గ్రహం రాశి మార్పు కారణంగా చాలా ప్రభావవంతంగా ఉంటుంది. వీరికి ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉండటం వల్ల చేపట్టిన పనుల్లో అన్ని రకాల సవాలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటారు. వీరు కొత్త ఆదాయ వనరులను ఏర్పరచుకోవడంలో తమ శక్తివంతంగా కృషి చేస్తారు. వీరు చేసే పనుల వల్ల వీరికి విజయం లభిస్తుంది. ఆకస్మికంగా ధన లాభం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఉద్యోగస్తులు వారి పని పట్ల ప్రశంసలు పొందుతారు. దీని వల్ల వీరు పదోన్నతి పొందే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. వ్యాపార విస్తరణకు ఇది మంచి సమయం. దీని వల్ల మీరు లాభాలు పెరుగుతాయి. వ్యాపార విస్తరణలో విదేశాల్లో పెట్టుబడులు పెడతారు. వివాహ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

తులారాశి: ఈ రాశి వారికి కుజ గ్రహం రాశి మార్పు కారణంగా మీరు తీసుకునే నిర్ణయాలలో సామర్థ్యం పెరుగుతుంది. అంతేకాకుండా మీరు ఎంచుకున్న గమ్యం పైన లక్ష్యాలు సాధించడం కోసం కృషి చేస్తారు. మీ సంకల్పబలంతో మీరు చేపట్టిన ప్రతి పనుల్లో కూడా విజయాన్ని సాధించి ఆదాయం పెరుగుదలకు ఉపయోగపడుతుంది. పూర్వీకుల నుండి ఆస్తి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. దూర ప్రయాణాలు చేస్తారు వ్యాపారం విస్తరణ కోసం పెట్టుబడులు పెడితే అవి లాభాలను తీసుకువస్తాయి. ప్రేమ వివాహాలకు అనుకూలం నూతన గృహాన్ని కొనుగోలు చేస్తారు.

Astrology: సెప్టెంబర్ నెలలో ఈ మూడు రాశుల పైన లక్ష్మీదేవి అనుగ్రహం

మీన రాశి: కుజుడు రాసి మార్పు కారణంగా ఈ రాశి వారికి చాలా సానుకూల ప్రభావాలు ఉన్నాయి. మీరు ఎప్పటినుండో ఇబ్బంది పడుతున్న అనారోగ్య సమస్య నుండి బయటపడతారు. దాని ద్వారా మానసికంగా సానుకూల ప్రభావం ఉంటుంది. మీలో ఆత్మవిశ్వాసము క్రమశిక్షణ ఎక్కువగా ఉంటుంది. కష్టపడే తత్వం ఉండడం వల్ల మీరు చేపట్టిన ప్రతి పనిలో కూడా విజయాన్ని సాధిస్తారు. మీరు కోరుకున్న రంగాల్లో ఉద్యోగం లభిస్తుంది. విద్యార్థులకు విద్యకు ఉన్నత అవకాశాలు లభిస్తాయి. విదేశాల్లో చదువుకోడానికి అవకాశం లభిస్తుంద. నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం మత విశ్వాసాల ఆధారంగా పేర్కొనడం జరిగింది. జ్యోతిష్యం, జాతకం విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు.