ఏ పండుగ అయినా సరే మొదటిగా మనము వినాయకుడిని పూజిస్తాము. దేవతలందరిలో మొదటి స్థానం వినాయకుడిదే. వినాయకుని పూజిస్తే కష్టాలు తొలగిపోయి ఉపశమనం లభిస్తుందని అందరి నమ్మకం. గణపతిని స్మరిస్తే విజ్ఞాలన్ని తొలగిపోయి ప్రతి పని కూడా శుభంగా జరుగుతుందని నమ్మకం. అయితే ఈసారి వినాయక చవితి సెప్టెంబర్ 7న భాద్రపద మాసంలో శుక్లపక్ష చతుర్థి నాడు జరుపుకుంటున్నారు. ఈ మూడు రాశుల వారు గణేష్ ని ఈ విధంగా పూజిస్తే మీకు ఆ గణేశుడు కృపా కటాక్షాలు ఎల్లప్పుడూ మీకు ఉంటాయి.
వృషభ రాశి: వృషభ రాశి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వృషభ రాశి వారు వినాయక చతుర్థి రోజు ఎరుపు రంగు వినాయకుడిని పూజించి, తొమ్మిది రోజులపాటు ఎర్రటి పువ్వులను ఎర్రటి బట్టలను సమర్పిస్తే మీ కుటుంబంలో ఆనందం సిరిసంపదలు కలుగుతాయి, ఆ గణేశుడి అనుగ్రహం మీ పైన ఎల్లప్పుడూ ఉంటుంది.
మేష రాశి: వినాయక చవితి రోజు ఈ మేష రాశికి చెందినవారు నీలిరంగు గణపతిని పూజించాలి. తొమ్మిది రోజులపాటు తెల్లని దుస్తులు ధరించి తెల్లటి పూలు తో ఆ గణపతిని పూజిస్తే దీనివలన మీరు కోరుకున్న కలలు నెరవేరుతాయి. ఆ గణేశుడి దయ ఎల్లప్పుడూ మీ పైన ఉంటుంది.
ఈ 2 రత్నాలు జూన్‌లో జన్మించిన వారు ఉంగరంలో ధరిస్తే అదృష్టవంతులు
మీన రాశి: మీనరాశిలో జన్మించిన వారు ఈ వినాయక చవితి రోజు ఆకుపచ్చని వినాయకుని విగ్రహాన్ని తెచ్చుకొని పూజించాలి. తొమ్మిది రోజులపాటు ఆకుపచ్చని దుస్తులు వేసుకొని ఆకుపచ్చ పండ్లు, తామర గింజలను ఆ వినాయకుడికి సమర్పిస్తే మీరు కోరుకున్న కలలు నెరవేరి మీ ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి.
తులారాశి: తులా రాశికి చెందినవారు వినాయక చవితి రోజు తెల్లటి గణపతిని ప్రతిష్టించుకోవాలి. వీరు గులాబీ కలర్ దుస్తులను ధరించి మోదకాలను అన్నం పాయసం, లడ్డూలను దేవుడికి సమర్పించాలి, ఇలా చేస్తే త్వరలోనే మీరు కోటీశ్వరులు అవుతారు.
కర్కాటక రాశి: కర్కాటక రాశికి చెందిన వారు ఆ గణేశుని అనుగ్రహాన్ని పొందడం కోసం వారు ఇంటిలో ఎరుపు రంగు వినాయకుడిను పూజించాలి. వీరు ఎరుపు రంగు దుస్తులను కూడా ధరించి ఆ వినాయకుడికి బెల్లంతో చేసిన స్వీట్లు, ఖర్జూరము సమర్పించాలి. ఇలా చేస్తే ఆ గణేశుడు యొక్క కృప మీ పైన ఎల్లప్పుడూ ఉంటుంది.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం మత విశ్వాసాల ఆధారంగా పేర్కొనడం జరిగింది. జ్యోతిష్యం, జాతకం విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ