జూలై 16న సూర్యుడు రాశి మారడం వల్ల కర్కాటక రాశిలోకి లక్ష్మీనారాయణ యోగం ఏర్పడుతుంది. ఇది రాజయోగం. అదే సమయంలో సూర్య భగవానుడు 18 వ తారీఖున బుధ గ్రహం కలవడం వల్ల ప్రమాదకరమైన బుధాదిత్య యోగం ఏర్పడుతుంది. ఇది అన్ని రాసి చక్రాలను సమస్యలను గురిచేస్తుంది. ముఖ్యంగా ఈ మూడు రాశుల వారికి ఆర్థిక నష్టం ఆరోగ్యపరమైన అనేక సమస్యలను తీసుకొస్తుంది. ఆ రాశులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
కుంభరాశి: ఈ రాశి వారికి కుటుంబ విషయంలో, ఆస్తి విషయంలో కుటుంబ సభ్యుల మధ్య తగాదాలు వస్తాయి. ఇంట్లో గొడవలు అయ్యే వాతావరణం ఉంటుంది. వ్యాపారస్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా వ్యాపారం చేసే ముందు ఒకటికి పది సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఉద్యోగస్తులకు వారి వృత్తిపరమైన విషయాలలో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. మీరు ప్రేమ వివాహం చేసుకున్నట్లయితే సమస్యలు ఎదుర్కొంటారు. మీ కుటుంబంలో అశాంతి ఉంటుంది. మీ ఇంట్లో వారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. కొత్తగా పెట్టుబడులు పెట్టాల్సినప్పుడు జాగ్రత్తగా వ్యవహరించండి. నష్టాలు వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి.
ధనస్సు రాశి: వ్యాపారస్తులు భవిష్యత్తులో చాలా నష్టాలను ఎదుర్కొనవలసి వస్తుంది. కొత్తగా పెళ్లయిన వారి మధ్యన గొడవలు రావచ్చు. ఆచితూచి మాట్లాడండి. ఎప్పటినుంచో ఉన్న కోర్టు సమస్య ఇంకా జఠినంగా అవుతుంది. ఎవరితో అయినా మాట్లాడేటప్పుడు మీ కోపాన్ని అదుపులో పెట్టుకోండి. లేకపోతే పెద్ద గొడవలు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. జీవిత భాగస్వామి ,స్నేహితులతో కూడా గొడవపడే అవకాశాలు చాలా ఉన్నాయి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో కొంచెం జటిలమైన పరిస్థితిని ఎదుర్కొంటారు. ర్యాంకు రాకపోవచ్చు ఇంట్లో పెద్దవారి ఆరోగ్యం కాస్త క్షీణిస్తుంది. కాబట్టి వారి పైన దృష్టి పెట్టండి.
వృశ్చిక రాశి: మీ తల్లి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఆమె ఆరోగ్యానికి ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశాలు చాలా ఉన్నాయి. కుటుంబంలో అశాంతి ఉంటుంది. కొత్తగా ఏమైనా కొనుగోలు చేయాలనుకుంటే జాగ్రత్తగా వ్యవహరించండి. ఎందుకంటే నష్టపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ప్రైవేటు ఉద్యోగాలు చేసేవారు జాగ్రత్తగా ఉండండి. మీ ఉద్యోగంలో ఇబ్బందులు తలెత్తటువంటి అవకాశాలు ఉన్నాయి.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం మత విశ్వాసాల ఆధారంగా పేర్కొనడం జరిగింది. జ్యోతిష్యం, జాతకం విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు.