జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒక గ్రహం తన రాశిని మార్చుకున్నప్పుడు అన్ని రాశుల పైన ప్రభావాలను చూపిస్తుంది. కొన్నిసార్లు మంచిని కొన్నిసార్లు చెడును చూపిస్తుంది. అయితే సెప్టెంబర్ 16న సూర్యుడు ,కేతు గ్రహాలు రాసి మార్పు కారణంగా మూడురాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది.
కర్కాటక రాశి- ఈ రాశి వారికి సూర్యుడు కేతువు వల్ల చాలా మేలు జరుగుతుంది. ఆదాయాన్ని పెంచుకోవడానికి అనేక అవకాశాలు వస్తాయి. పెండింగ్లో ఉన్న పనులు సకాలంలో పూర్తవుతాయి. ప్రతిరోజు సూర్యునికి పూజించడం ద్వారా మీకు మేలు జరుగుతుంది. ఉద్యోగస్తులకు లాభదాయకంగా ఉంటుంది. సమాజంలో గుర్తింపు లభిస్తుంది. ఆరో అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందుతారు. కుటుంబ సభ్యులతో ప్రేమ పెరుగుతుంది.
Astrology: శ్రీకాళహస్తి వాయులింగేశ్వరుడికి ఇష్టమైన 4 రాశులు ఇవే
తులారాశి- ఈ రాశి వారికి సూర్యుడు, కేతు గ్రహాల కలయిక వల్ల వ్యాపారంలో పెట్టుబడులు మంచి లాభాలు వస్తాయి. విదేశీ పర్యటనలకు వెళ్తారు. సమాజంలో పేరు ప్రఖ్యాతలు పెంచుకుంటారు. ఉద్యోగస్తులకు వ్యాపారం చేసే వారికి ఇది చాలా మంచి సమయం మీ వ్యాపార విస్తరణకు విదేశాల్లో పెట్టుబడులు పెడతారు. మీరు చేయాలనుకున్న పనితో పనిని నిస్వార్ధంగా చేస్తారు. అది కచ్చితంగా నెరవేరుతుంది. విద్యార్థులకు పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. ఖర్చులు తగ్గి ఆదాయం పెరుగుతుంది.
కన్యా రాశి- సూర్యుడు ,కేతు గ్రహాల కలియక వల్ల ఈ రాశి వారికి సానుకూలంగా ఉంటుంది. ప్రతిరోజు సూర్యునికి పూజ చేసి నీరు సమర్పించడం ద్వారా మీరు కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. మీ ఆదాయం రెట్టింపు అవుతుంది. మీ మాటలతో అందరి హృదయాలను గెలుచుకుంటారు. ఉద్యోగం చేసే వారికి త్వరలోనే ప్రమోషన్ వస్తుంది. ఆదాయం పెరగడంతోటి సమాజంలో మీకు గౌరవం పెరుగుతుంది. అజాగ్రత్తగా ఉండకండి. పూర్వీకుల ఆస్తి లభిస్తుంది. నూతన గృహాన్ని కొనుగోలు చేస్తారు.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం మత విశ్వాసాల ఆధారంగా పేర్కొనడం జరిగింది. జ్యోతిష్యం, జాతకం విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు.