వినాయక చవితి పండుగను చాలా అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. ఆ వినాయకుని ప్రసన్నం చేసుకోవడానికి పూజలు చేస్తారు. ఈ సంవత్సరం వినాయక చవితి సెప్టెంబర్ 7న ప్రారంభమవుతుంది. ఈరోజు పూజ చేసి వినాయకుడికి ఇష్టమైన నైవేద్యాలను సమర్పిస్తారు. గణేష్డికి ఇష్టమైన ఈ నైవేద్యాల ద్వారా నైవేద్యాలు పెట్టి మీరు కోరుకున్న కోరికను ఆ వినాయకుడు తీరుస్తాడని నమ్మకం. వినాయకుడికి
ఇష్టమైన నైవేద్యాలు.
లడ్డు: వినాయకుడికి ఎంతో ఇష్టమైన స్వీటు లడ్డు. గణపతి బప్పా కు లడ్డు అంటే ఎంతో ఇష్టం వినాయక చవితి రోజు వినాయకుడికి పూజ చేసి లడ్డూలు నైవేద్యంగా సమర్పిస్తే ఆ వినాయకుడి అనుగ్రహం మీపై ఎల్లప్పుడూ ఉంటుంది. మీరు కోరుకున్న కోరికలు నెరవేరుతాయి.
Astrology: సెప్టెంబర్ నెలలో ఈ మూడు రాశుల పైన లక్ష్మీదేవి అనుగ్రహం
ఉండ్రాళ్ళు: వినాయకుడికి లడ్డు మాత్రమే కాకుండా ఇంకో అతి ఇష్టమైన నైవేద్యం ఉండ్రాళ్ళు. వినాయక చవితి రోజు 101 ఉండ్రాళ్ళు గణేషుడికి సమర్పించుకుంటే మీరు కోరుకున్న కోరిక నెరవేరుతుంది.
పాయసం: గణపతికి పాయసం అంటే కూడా ఎంతో ప్రీతి వినాయక చవితి రోజు పాయసం చేసి ఆ గణేశుడికి నైవేద్యంగా సమర్పిస్తే ఆ వినాయకుడి అనుగ్రహం మీపై ఎల్లప్పుడూ ఉంటుంది. మీ కష్టాలు తొలగిపోయి మిమ్మల్ని అదృష్టవంతులుగా చేస్తాడు.
అరటి పళ్ళు: వినాయకుడికి అత్యంత ఇష్టమైన పండ్లలో అరటిపండు ఒకటి. అరటిపండును వినాయక చవితి రోజు వినాయకుడు పూజ తర్వాత అరటి పళ్ళను నైవేద్యంగా సమర్పించినట్లయితే ఆ వినాయకుడి అనుగ్రహాన్ని పొందుతారు. వినాయకుడు అనుగ్రహం పొందడం ద్వారా మీ ఏలినాటి బాధలన్నీ తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం మత విశ్వాసాల ఆధారంగా పేర్కొనడం జరిగింది. జ్యోతిష్యం, జాతకం విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు.