మిథునం: ఈ రాశి వారు ఉద్యోగ వ్యాపార విషయంలో అత్యున్నత స్థాయికి చేరుకుంటారు. కావాల్సినంత డబ్బు లభిస్తుంది. లక్ష్మీదేవి కటాక్షంతో ఈ రాశి వారు కోటీశ్వరులు అయ్యే అవకాశం ఉంది. లాటరీ వంటివి తగిలే వీలుంటుంది. అలాగే ఈ రాశి వారు తమ సన్నిహితుల సహకారం వల్ల ఉన్నత స్థాయికి చేరుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగంలో వ్యాపారం చేసేవారు కూడా చక్కగా రాణించే అవకాశం ఉంటుంది. విదేశాల్లో వ్యాపారం చేసేవారు మంచి లాభాలను పొందే అవకాశం ఉంటుంది. అమెరికా వెళ్లాలని ప్రయత్నిస్తున్న వారికి వీసా లభించే వీలుంది.
కర్కాటకం: ఈ రాశి వారు తమ సంతానం వల్ల శుభవార్తలు పొందుతారు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో మంచి ఫలితాలు సాధిస్తారు వ్యాపారస్తులు కూడా మీ వ్యాపారంలో మంచి లాభాలు పొందే అవకాశం ఉంటుంది. కొత్తగా పెళ్లయిన దంపతులు శుభవార్తలు వినే అవకాశం ఉంటుంది. దూర ప్రాంతాలకు వెళ్లేవారు జాగ్రత్తగా ఉండాలి. మీ వద్ద సరిపడ ధనం ఉంచుకోండి. ఎత్తైన ప్రదేశాలకు ఒంటరిగా వెళ్లవద్దు. ఆహార విషయంలో జాగ్రత్తగా ఉండాలి జీర్ణ సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. సుబ్రమణ్య స్వామిని పూజించండి.
ధనస్సు: ఈ రాశి వారు వ్యాపార రంగంలో అనుకున్న దాని కన్నా అత్యధిక ఫలితాలు లభించే అవకాశం ఉంది. మీరు రూపాయి పెట్టుబడి పెడితే 100 రూపాయలు వచ్చే అవకాశం లభిస్తుంది. దాదాపు మీకు లాటరి టికెట్ తగిలినట్టే అని చెప్పవచ్చు. అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో నమ్మిన వారి చేతిలో మోసపోయే ప్రమాదం ఉంది కనుక ఓ కంట కనిపెడుతూ ఉండాలి. . అలాగే ఎవరైతే పుణ్యక్షేత్రాలకు వెళ్లాలని చాలా కాలంగా ఎదురుచూస్తున్నారో, వారి ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తాయి. ప్రతిరోజు రావి చెట్టుకు నీరు పోయండి.
మకరం: ఎవరైతే నూతనంగా వివాహం చేసుకున్నారో వారి జీవిత భాగస్వామి వల్ల మీరు మంచి శుభవార్తలు వినే అవకాశం ఉంటుంది. మీ సంతానం విద్యాసంస్థల్లో మంచి పేరు సంపాదించుకుంటారు. షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టినవారు లాభాలు పొందే వీలుంది. రియల్ ఎస్టేట్ రంగంలో కూడా మీరు పెట్టుబడులు రెండింతలు అయ్యే అవకాశం లభిస్తుంది. అయితే డబ్బు విషయంలో నమ్మిన వారి చేతుల్లో మోసపోయే ప్రమాదం ఉంది కనుక జాగ్రత్తగా ఉండండి.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం మత విశ్వాసాల ఆధారంగా పేర్కొనడం జరిగింది. జ్యోతిష్యం, జాతకం విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు.