astrology

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఎంతో శుభకరమైన గ్రహంగా గురుడు చెప్పవచ్చు. విద్యకు పిల్లలకు సంపదకు కీర్తి ప్రతిష్టలకు మొదలైన కారణం కలిగి ఉంటుంది. ఈ గురు గ్రహం గురు గ్రహం అక్టోబర్ 9న తిరోగమన కదలిక వల్ల రానున్న మూడు నెలల్లో ఈ మూడు రాశుల వారికి ప్రతికూల ప్రభావాలు ఉంటాయి. ఆ మూడు రాశులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

కన్యా రాశి- గురుడు తిరోగమన కదలిక వల్ల ఈ రాశి వారికి కొన్ని ప్రతికూల ఫలితాలు ఉన్నాయి. మీరు వ్యాపారాన్ని అభివృద్ధి చేయాలనుకునే సమయంలో అడ్డంకులు వస్తాయి. పెట్టుబడి నుండి లాభాలు పొందడంలో కొంచెం ఇబ్బంది పడతారు. పనిచేసే చోట ఒత్తిడి పెరుగుతుంది. మీరు పని చేసే చోట మీ తోటి ఉద్యోగుల తోటి అభిప్రాయ బేధాలు వస్తాయి. వ్యాపారవేత్తలకు కొన్ని నష్టాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. కొత్త వ్యాపారాన్ని ఒప్పందాలు చేసుకునేటప్పుడు కొన్ని ఇబ్బందులు ఏర్పడతాయి. నిర్ణయం తీసుకునేటప్పుడు ఆలోచించి తీసుకోవడం ఉత్తమం. విద్యార్థులు చదువు పైన ఆసక్తి అంతగా చూపరు. జీవిత భాగస్వామితో గొడవ అయ్యే అవకాశం ఉంది. ఎప్పటినుంచో ఇబ్బంది పెడుతున్న కోర్టు సమస్య పెండింగ్లోనే ఉంటుంది. దూర ప్రయాణాలకు వెళ్లేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.

Astrology: ఉదయం నిద్రలేచిన వెంటనే వీటిని చూడకండి

వృశ్చిక రాశి- ఈ రాశి వారికి గురు గ్రహం తిరోగమన కదలిక వల్ల ఈ రాశి వారికి కొద్దిగా నష్టాలు పెరుగుతాయి. ఆదాయం కంటే ఖర్చులు ఎక్కువగా అవుతాయి. ఎప్పటినుంచ ఇబ్బంది పడుతున్న అనారోగ్య సమస్య తీవ్రం అవ్వడం ద్వారా మీకు ఖర్చు పెరుగుతుంది. మరోవైపు మీ వ్యాపారంలో ఆదాయం తగ్గుతుంది. ఉద్యోగంలో పని భారం వల్ల మానసికంగా ఒత్తిడి గురవుతారు. వ్యాపారంలో నష్టాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. సిబ్బందికి సంబంధించి అనేక సమస్యలు ఏర్పడతాయి. మీరు పని చేసే చోట మీపైన ఫిర్యాదులు వస్తాయి. విద్యార్థులు ఏకాగ్రత తగ్గుతుంది. ప్రేమ వివాహాల్లో ఆచితూచి ఉండండి. మీ పైన అప నమ్మకం పెరుగుతుంది. కుటుంబ సభ్యుల మధ్య గొడవలు అవుతాయి. ప్రదేశాలకు వెళ్ళకండి.

తులారాశి- ఈ రాశి వారికి గురు గ్రహం తిరోగమన కదలిక వల్ల కొంత ప్రతికూలంగా ఉంటుంది. కొత్త ఆదాయ వనరులు వచ్చేటువంటి అవకాశాల్లో కొంచెం ఆలస్యం అవుతుంది. పెట్టుబడుల వల్ల నష్టపోయే అవకాశం ఉంది. ఉద్యోగంలో మీరు పని చేసే చోట పై అధికారులతో విభేదాలు వస్తాయి. మీరు వ్యాపారం చేసేటప్పుడు పార్టనర్ షిప్ వ్యాపారాలలో సమస్యలు వస్తాయి. పరిశ్రమల్లో ముడి సరుకు కోసం లభించడంలో సమస్య ఏర్పడుతుంది. కుటుంబ సభ్యులతో గొడవలు అవుతాయి. వైవాహిక జీవితంలో కాస్త ఇబ్బందులు పెరుగుతాయి. మీ ఆరోగ్యం దెబ్బతింటుంది. తల్లిదండ్రుల ఆరోగ్యం పైన శ్రద్ధ పెట్టండి. మానసికంగా కాస్త గందరగోళ పరిస్థితి ఏర్పడుతుంది.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం మత విశ్వాసాల ఆధారంగా పేర్కొనడం జరిగింది. జ్యోతిష్యం, జాతకం విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు.