Khairatabad Ganesh 2023 (Photo-ANI)

జ్యోతిష శాస్త్రం ప్రకారం వినాయకుని ప్రత్యేకంగా ఆరాధిస్తాము. దేవతలందరిలో మొదటిగా వినాయకుని పూజిస్తాము. విజ్ఞాలను తొలగించేది వినాయకుడిగా మనము మొదటి స్థానంలో ఉంచి పూజిస్తాము. పూజించిన తర్వాత మాత్రమే ఇతర దేవుళ్ళను పూజించడం ప్రారంభిస్తాము. నమ్మకాల ప్రకారం గణపతిని పూజిస్తే కష్టాలు తొలగిపోయి భగవంతుడు కరుణిస్తాడని నమ్మకం. వినాయక చవితి నాడు గణేశుని పూజించడం ద్వారా అనేక ఫలితాలు పొందుతారు. ఈసారి వినాయకుడి పండగ సెప్టెంబర్ 7న జరుపుకుంటున్నారు. అయితే గణేశుడి చతుర్థి రోజు కోరుకున్న ఫలితాలు లభిస్తాయి. వినాయకుడి అనుగ్రహం పొందే ఆ మూడు రాశుల గురించి తెలుసుకుందాం.

తులారాశి: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ రాశి వారికి అధిపతి బుధ గ్రహం వినాయకుడి దయ వల్ల ఈ రాశి వారికి ఎల్లప్పుడూ అనుగ్రహం ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వారు వినాయకుడిని రోజు చవితి రోజు ఆ దేవున్ని పూజిస్తే తిరుగులేని విజయాన్ని పొందుతారు. అంతేకాకుండా వీరికి ఆర్థిక సమస్యల నుండి బయటపడతారు. అనారోగ్య మానసిక సమస్యల నుంచి కూడా ఉపశమనం పొందుతారు. మీరు చేపట్టిన ప్రతి పనిని కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు.

Astrology: సెప్టెంబర్ 30 వరకు ఈ 5 రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి

మేషరాశి: ఈ రాశి వారికి కూడా చంద్రుని అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది. ఈ కారణంగా వినాయకుడికి వినాయక చవితి రోజు పూజ చేస్తే మీ జీవితంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. వినాయకుడి యొక్క ఆశీస్సులతో వీరికి తెలివితేటలు నైపుణ్యాలు అభివృద్ధి చెందుతాయి. దీని కారణంగా మీరు డబ్బు సంపాదనలో ఎటువంటి సమస్యలు ఏర్పడవు. నూతన గృహాన్ని కొనుగోలు చేస్తారు ఆర్థిక సమస్యల నుండి బయటపడతారు. కుటుంబ సభ్యులతో కలిసి దూర ప్రయాణాలకు వెళతారు.

వృషభ రాశి: వృషభ రాశి వారికి కూడా అధిపతి బుధ గ్రహం దేవుడు గణపతి. గణపతిని పూజించడం ద్వారా వీరు ప్రత్యేక అనుగ్రహాన్ని పొందుతారు. వినాయకుడు చవితి రోజు వీరు వినాయకుని పూజిస్తే కష్టాలన్నీ తొలగిపోతాయి. అంతేకాకుండా వీరి జీవితంలో ఎల్లప్పుడూ కూడా ఆనందం ఉంటుంది. సిరిసంపదలతో ఎప్పుడు కూడా వృద్ధి చెందుతారు. విద్యార్థులకు కోరుకున్న రంగాలలో ఉద్యోగం లభిస్తుంది. ఏలినాటి శని నుండి బయటపడతారు. దీని ద్వారా మీరు ఆర్థిక సమస్యల నుండి బయటపడతారు.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం మత విశ్వాసాల ఆధారంగా పేర్కొనడం జరిగింది. జ్యోతిష్యం, జాతకం విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు.