న్యూమరాలజీ ప్రకారం ప్రతి తేదీకి కూడా ఒక ప్రత్యేకత ఉంటుంది. ఈ మూడు తేదీల్లో జన్మించిన వారు చాలా అదృష్టవంతులుగా ఉంటారు. వీరు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. ఆర్థికపరమైన సమస్యలు ఉండవు. ముఖ్యంగా వీరి రాడిక్స్ సంఖ్య 6. ఈ రాడిక్స్ సంఖ్య 6 ఉన్నవారు ఏ తేదీలో జన్మించిన వారికి అదృష్టం కలిసి వస్తుంది. వీరు కోరుకున్న పనిని త్వరలోనే పూర్తి చేస్తారు. ధనవంతుల అవుతారు. వ్యాపారంలో అధిక లాభాలు వస్తాయి. ఆ రాడిక్స్ సంఖ్యలో జన్మించిన వారి లక్షణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Vastu Tips: బెడ్రూంలో పొరపాటును కూడా ఈ వస్తువులను ఉంచకండి,
రాడిక్స్ 6
రాడిక్స్ సంఖ్య 6 ఉన్నవారు అంటే ఏదైనా నెలలో 6తేదీ 15 , 24 తేదీల్లో జన్మించిన వారికి రాడిక్స్ సంఖ్య 6 ఉంటుంది. వీరు చాలా సానుభూతి బాధ్యతాయుతంగా ఉంటారు. కుటుంబం పట్ల స్నేహితుల పట్ల ప్రేమను కలిగి ఉంటారు. వీరు ఏ పని చేయడానికి కూడా ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు.
శుక్రుడు
రాడిక్స సంఖ్య 6 ఉన్నవారికి అధిపతి శుక్రుడు. వీరికి ప్రేమ సంపద ఆనందానికి అధిపతి అయిన శుక్రుడు వీరిని ఎల్లప్పుడూ కాపాడుతాడు. ముఖ్యంగా వీరిని చాలా అదృష్టవంతులుగా చెప్పవచ్చు. మీరు అందరితో స్నేహపూర్వకంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో కలిసిమెలిసి ఉంటారు. వీరు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. జీవితంలో రకరకాల అయినటువంటి ఆనందాలను అనుభవిస్తారు. వీరు ఖరీదైన ఇళ్లల్లో ఖరీదైన వాహనాల్లో తిరుగుతూ ఉంటారు. వీరు ఏ పని చేపట్టిన అది విజయవంతంగా పూర్తి అవుతుంది. ఆర్థికంగా అనేక లాభాలు వస్తాయి. సమాజంలో గౌరవ ప్రతిష్ట పెంచుకుంటారు.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం మత విశ్వాసాల ఆధారంగా పేర్కొనడం జరిగింది. జ్యోతిష్యం, జాతకం విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు.