జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్ర గ్రహం చాలా మంచి గ్రహం. ఇది మన జీవితాల్లో ముఖ్యమైన విషయాలకు సంబంధించి విజయాన్ని అందించే గ్రహం. ఇది అనేక శుభగ్రహాల కీర్తికి సంపదకు ఆనందానికి సంతోషకరమైన జీవితానికి ఇది ప్రముఖ పాత్ర పోషించే గ్రహం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్ర గ్రహం తన రాశిని 24వ తేదీ సెప్టెంబర్ 24 న మధ్యాహ్నం చిత్తా నక్షత్రాన్ని వదిలి స్వాతి నక్షత్రం లోనికి ప్రవేశిస్తాడు. శుక్ర గ్రహము నక్షత్ర సంచారం కారణంగా ఈ మూడు రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. ఆ మూడు రాశులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
మీనరాశి- ఈ రాశి వారికి శుక్రుడు గ్రహం స్వాతి నక్షత్రంలోనికి ప్రవేశం వల్ల మీకు అనుకూల ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా మీ వ్యాపారం వృద్ధి చెందుతుంది. కొత్త కస్టమర్లు వస్తారు దీని ద్వారా ఆదాయ వేలరులు పెరుగుతాయి. మీరు పని చేసే చోట ఉద్యోగంలో ప్రమోషన్ పెరుగుతాయి. దీని వల్ల ఆర్థికంగా లాభదాయకరమైన అవకాశాలు వస్తాయి. షేర్ మార్కెట్లో విపరీతమైన లాభాలు వస్తాయి. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళతారు. ఆరోగ్యం బాగుంటుంది. మీరు ఎప్పటినుంచో చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగంలో పురోగతికి అవకాశాలు ఉన్నాయి. మీరు పెట్టిన పెట్టుబడుకు అనుకూలంగా లాభాలు వస్తాయి. మీ జీవిత భాగస్వామితో సన్నిహిత్యం పెరుగుతుంది. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. దీని ద్వారా మీకు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి.
Astrology: ఈ 4 తేదీల్లో పుట్టిన వారు చిన్న వయసులోనే కోటీశ్వరులవుతారు .
వృషభరాశి- ఈ రాశి వారికి శుక్రుని సంచారం కారణంగా అనేక అనుకూలమైన అవకాశాలు ఏర్పడతాయి. వ్యాపారంలో మీ ఆదాయం పెరుగుతుంది. కొత్త వ్యాపార సంబంధాలు బలపడతాయి. ఉద్యోగం డబ్బు సంపాదించడానికి మీరు చేసే ప్రతి పనిలో కూడా విజయాన్ని సాధిస్తారు. మధురమైన అనుభూతులను పొందుతారు. ఆరోగ్యం బాగుంటుంది. నూతన గృహాన్ని కొనుగోలు చేస్తారు విదేశాల్లో పెట్టుబడులు పెట్టడానికి ఇది మంచి సమయం. మీకు విదేశీ పర్యటన చేసే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు.
ధనస్సు రాశి- ఈ రాశి వారికి శుక్రుని సంచారం కారణంగా అనేక సానుకూల ఫలితాలు ఉంటాయి. ఎప్పటినుంచో ఇబ్బంది పడుతున్న మానసిక సమస్యలన్నీ కూడా తగ్గుతాయి. మీరు పని చేసే చోట అందరు మద్దతు లభిస్తుంది. సృజనాత్మక పని పట్ల మీకు ఆసక్తి పెరుగుతుంది. ఎప్పటి నుంచి ఇబ్బంది పడుతున్న అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందుతారు. దీని వల్ల మానసికంగా దృఢంగా ఉంటారు. మీరు పని చేసే చోట సామాజిక ప్రతిష్ట పెరుగుతుంది. షేర్ మార్కెట్ నుంచి మంచి లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీ ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు ఉద్యోగులలో ఆర్థిక లాభాలు పెరుగుతాయి.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం మత విశ్వాసాల ఆధారంగా పేర్కొనడం జరిగింది. జ్యోతిష్యం, జాతకం విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు.