astrology

తుల: ఈ రాశి వారు ఎవరైతే సంతానం కోసం ఎదురుచూస్తున్నారు వారి కలలు పండే యోగం వచ్చిందని చెప్పవచ్చు. నూతనంగా వివాహం చేసుకున్నవారు శుభవార్తలు వినే అవకాశం ఉంది. వ్యాపారస్తులు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి లేకపోతే నమ్మిన వారి చేతిలోనే మోసపోయే ప్రమాదం ఉంది. దూర ప్రయాణాలు వెళ్తున్న వారు ఒంటరిగా వెళ్లవద్దు మీ తోడుగా ఎవరినైనా తీసుకొని వెళ్ళండి. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి అతివేగం పనికిరాదు. విదేశాల్లో వ్యాపారం చేసేవారు మంచి శుభవార్తలు వినే అవకాశం ఉంది.

వృశ్చికం: ఈ రాశి వారు ఉద్యోగం చేస్తున్నట్లయితే వారు ప్రమోషన్ గురించి మంచి వార్తలు వినే అవకాశం ఉంటుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో చక్కటి ఫలితాలు సంపాదించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పౌల్ట్రీ, రియల్ ఎస్టేట్, వస్త్ర వ్యాపారం, ఫార్మసీ, ఇంజనీరింగ్ పరిశ్రమల్లో వ్యాపారం చేసేవారు చక్కటి లాభాలు పొందే అవకాశం ఉంటుంది. ప్రతి శనివారం శనీశ్వరుడి వద్దకు వెళ్లి నువ్వుల నూనె సమర్పించడం ద్వారా మీరు మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది.

కుంభం: ఈ రాశి వారు వెంటనే అనుకున్న పనులను పూర్తి చేసుకుంటే మంచిది. లేకపోతే ఆ పనులు చివరి వరకు వాయిదా పడే అవకాశం ఉంటుంది. ఎవరైతే రియల్ ఎస్టేట్ రంగంలో వ్యాపారం చేస్తున్నారో వారు చక్కటి లాభాలు పొందే అవకాశం ఉంటుంది. అలాగే విదేశాలకు వెళ్లాలని వీసా ప్రయత్నాల కోసం ఎదురుచూస్తున్న వారు కూడా శుభవార్తలు వింటారు. దీంతో పాటు విద్యార్థులు పోటీ పరీక్షల్లో చక్కటి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. తల్లిదండ్రుల వల్ల మీకు మంచి ఆస్తులు లభిస్తాయి.

మీనం: కోర్టు వివాదాల్లో చిక్కుకున్నటువంటి ఆస్తులు మీకు లభించే అవకాశం ఉంది. స్టాక్ మార్కెట్లో మీరు పెద్ద ఎత్తున లాభాలు పొందుతారు. చర్మ వ్యాధుల గురించి జాగ్రత్తగా ఉండాలి. అయితే వ్యాపారంలో మాత్రం మీరు చక్కటి ఫలితాలు పొందే వీలుంది. నూతనంగా చేపట్టిన వ్యాపారంలో కష్టాలన్నీ తొలగిపోయి. మీ పెట్టుబడి రెండింతలు అయ్యే వీలుంది. వీర భద్ర స్వామి ఆశీర్వాదం తీసుకుంటే మీకు మంచి జరుగుతుంది.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం మత విశ్వాసాల ఆధారంగా పేర్కొనడం జరిగింది. జ్యోతిష్యం, జాతకం విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు.