జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్ర గ్రహానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ గ్రహం సమాజంలో గౌరవాన్ని పెంచుతుంది. డబ్బుకు కొరత ఉండదు. ఇది శుక్ర గ్రహం కుంభ రాశిలోకి ప్రవేశించడం వల్ల 4 రాశులకు అదృష్టం కలిసి వస్తుంది. ఆ నాలుగు రాశులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
మేష రాశి: ఈ రాశి వారికి ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. విద్యార్థులకు పూజా కార్యక్రమాల పట్ల ఆసక్తి ఏర్పడుతుంది. దాని ద్వారా ఒత్తిడి నుంచి బయటపడి మానసిక ప్రశాంతత లభిస్తుంది. వ్యాపారవేత్తలు తమ శత్రువుల పైన విజయం సాధిస్తారు. క్రీడా పోటీలలో విద్యార్థులు విజయాన్ని అందుకుంటారు. ఎప్పటినుంచో ఇబ్బంది పెడుతున్న రుణ బాధల నుండి విముక్తి పొందుతారు. నూతన గృహాన్ని కొనుగోలు చేస్తారు.
కుంభరాశి: ఈ రాశి వారికి తమ వ్యాపారాన్ని విస్తరించుకునేందుకు ఇదే చాలా మంచి సమయం వ్యాపారంలో పురోగతితో పాటు అపారమైన ఆర్థిక లాభాలు ఉంటాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్ లభిస్తుంది. సమాజంలో కుటుంబంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. విదేశాలకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతారు.
మిథున రాశి: ఈ రాశి వారికి ఎప్పటినుంచో ఉపాధి కోసం చేసే పనులు పూర్తవుతాయి. మీ కుటుంబంలో కొన్ని శుభవార్తలు ప్రారంభమవుతాయి. రాబోయే రోజుల్లో కుటుంబ సభ్యులతో చాలా సంతోషంగా గడుపుతారు. వ్యాపారంలో పెట్టుబడులకు అనుకూలం భాగస్వామ్యం వ్యాపారాలకు మంచి మద్దతు లభిస్తుంది. విహార విహారయాత్రలకు వెళ్లే అవకాశం ఉంది. ఎప్పటినుంచో కోర్టులో పెండింగ్లో ఉన్న సమస్యలు తొలగిపోతాయి. ఎప్పటినుంచో ఇబ్బంది పెడుతున్న అనారోగ్య సమస్య నుండి బయటపడతారు.
కర్కాటక రాశి: ఈ రాశి వారికి చేపట్టిన ప్రతి పనిలో కూడా పురోగతి పొందుతారు. డబ్బు సంపాదించడానికి కొత్త మార్గాలు ఏర్పడతాయి. కుటుంబంతో కలిసి విహార యాత్రలకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. మీ కుటుంబ సభ్యుల్లో పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది. విద్యార్థులకు వారి భవిష్యత్తుకు ఉపయోగపడే మంచి ఉద్యోగం లభిస్తుంది. కెరీర్లో ముందుకు దూసుకెళ్తారు.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం మత విశ్వాసాల ఆధారంగా పేర్కొనడం జరిగింది. జ్యోతిష్యం, జాతకం విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు.