astrology

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్ర గ్రహం కీర్తి, సంపదలను, ఆనందాన్ని ఇచ్చే గ్రహం. ఈ గ్రహం రాశి మార్పు కారణంగా అనేక శుభ ఫలితాలను కలిగి ఉంది. ముఖ్యంగా ఆ మూడు రాశులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

తులారాశి: శుక్ర గ్రహ రాశి మార్పు కారణంగా ఈ తులా రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది. వీరిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. విద్యార్థుల్లో సృజనాత్మకత కూడా పెరుగుతుంది. వీరి ప్రతిభకు తగ్గ ఫలితం లభిస్తుంది. వీరు కళలు, సంగీతం, రచన వంటి రంగాల్లో మొదటి స్థానం పొందుతారు. దీని ద్వారా మీరు ఆర్థికంగా కూడా లాభం పొందుతారు. ఉద్యోగస్తులకు ప్రమోషన్ లభిస్తుంది. మీ వ్యాపార సంబంధాలు బలపడతాయి. వ్యాపారాన్ని విస్తరించేందుకు కొత్త అవకాశాలు వస్తాయి. దీని వల్ల మీ వ్యాపారం బలపడుతుంది. ప్రేమ వివాహాలకు అనుకూలం మీ జీవిత భాగస్వామితో స్నేహపూర్వకంగా ఉంటారు. కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. విహారయాత్రలకు వెళ్తారు.

Astrology: కనక దుర్గమ్మకు అత్యంత ఇష్టమైన 4 రాశులు ఇవే..

మేషరాశి: ఈ రాశి వారికి శుక్ర గ్రహం రాశి మార్పు కారణంగా అద్భుత ఫలితాలు లభిస్తాయి. ఎప్పటినుంచో ఇబ్బంది పెడుతున్న అనారోగ్య సమస్య నుంచి బయటపడతారు. మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. పాత వ్యాధులు నయం అవుతాయి. మానసిక సమస్యల నుంచి బయటపడతారు. రాజకీయంగా మీరు సామాజికంగా ప్రతిష్టను పొందుతారు. ప్రజల నుంచి గౌరవాన్ని పొందుతారు. కెరీర్లో కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. మీరు శ్రమకు తగినంత ఫలితం లభిస్తుంది. విద్యార్థులకు పోటీ పరీక్షల్లో విజయ అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగస్తులకు కొత్త ఆదాయ వనరులు వస్తాయి. మీ ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో సంబంధాలు బలోపేతం అవుతాయి. కుటుంబ సభ్యులతో కలిసి విదేశీయానం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నూతన గృహాన్ని కొనుగోలు చేస్తారు.

కర్కాటక రాశి: ఈ రాశి వారికి వ్యాపార పరంగా అనేక ప్రయోజనాలు ఉన్నాయి. మీ వ్యాపారాన్ని విస్తరించి చేయడానికి కొత్త ఒప్పందాలను పొందే అవకాశాలు ఉన్నాయి. ఆర్థికంగా మీరు చాలా లాబదాయకంగా ఉంటారు. ఉద్యోగస్తులకు ధన లాభ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆర్థిక పరిస్థితి పుంజుకుంటుంది. విద్యార్థులకు భవిష్యత్తులో కెరీర్ పరంగా కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. మీకు నూతన స్నేహితులు ఏర్పడతారు సామాజికంగా మీ సర్కిల్ పెరుగుతుంది. ఇంట్లో ఆనందం శుభకార్యాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంది. శుభకార్యాలలో పాల్గొంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల వైపు పయనిస్తారు. సమాజంలో మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం మత విశ్వాసాల ఆధారంగా పేర్కొనడం జరిగింది. జ్యోతిష్యం, జాతకం విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు.