laxmi devi

వరలక్ష్మీ వ్రతం ఎప్పుడు జరుపుకోవాలి . ఎలా జరుపుకోవాలి  పాటించాల్సిన నియమాలు ఇవే.శ్రావణమాసం అంటేనే చాలా శుభకరం. శ్రావణ మాసం వచ్చిందంటే చాలు అనేక రకాలైనటువంటి నోములు, వ్రతాలు ఆడవాళ్లు జరుపుకుంటారు. భర్త ఆరోగ్యం, పిల్లల ఆరోగ్యం ఆర్థిక సమస్యల నుంచి బయటపడడానికి. మానసిక సమస్యల నుంచి బయటపడడానికి ఈ లక్ష్మీదేవి వ్రతాన్ని చేసుకుంటారు. వరలక్ష్మీ వ్రతం ప్రతి సంవత్సరము శ్రావణమాసం రెండో శుక్రవారం రోజు జరుపుకుంటారు

వరలక్ష్మి వ్రతం పూజ ను ఎలా చేసుకోవాలి.

వరలక్ష్మీ వ్రతం రోజున ఉదయాన్నే ఐదు గంటలకు నిద్ర లేచి తలస్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకోవాలి .గుమ్మం ముందు పద్మం ముగ్గు వేయాలి. పవిత్ర గంగాజలంతో పూజా మందిరాన్ని శుద్ధి చేసుకోవాలి. తర్వాత వరలక్ష్మి దేవి ఫోటోని ,విగ్రహాన్ని కానీ సిద్ధం చేసుకోవాలి. లక్ష్మీదేవికి పెట్టే ప్రదేశంలో ఒక కొత్త బట్టలు తీసుకొని దానిపైన విగ్రహాన్ని కానీ పటాన్ని కానీ ఉంచాలి. తర్వాత విగ్రహం అయితే లక్ష్మీదేవికి కొత్త చీరను నగలను అలంకరించాలి. వరలక్ష్మి దేవి ఫోటో అయితే శుభ్రపరచుకొని కుంకుమ, పసుపు, గంధం, బొట్లతో, పూలతో అలంకరించుకోవాలి. అదేవిధంగా అమ్మవారికి కొబ్బరికాయ, అక్షతలు, చందనము, సింధూరం కూడా అర్పించాలి. తర్వాత మీరు కలశాన్ని కనుక పెట్టుకునే ఆనవాయితీ ఉన్నట్లయితే కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి.

Astrology: మీరు ఉదయం నిద్రలేచిన వెంటనే ఈ పనులు చేస్తే చాలు ...

మీరు వరలక్ష్మీ పూజ  పూర్తి చేసుకున్నాక ఐదుగురు ముత్తైదులకు వాయనం ఇవ్వాలి. వాయనంలో పండ్లు, ఆకు ఒక్క, నానబెట్టిన శనగలు, గాజులు, పెడుతూ ఉంటారు. వాయనం  ఇచ్చిన ముత్తైదులతోటి ఆశీర్వాదం తీసుకోవాలి. వచ్చిన ముత్తయిదులకు బొట్టు పెట్టి, గంధం పెట్టి ,కాళ్లకు పసుపు పెట్టి వారిని అమ్మవారి దగ్గర అక్షతలు వేయమని చెప్పి వారిని కూడా వరలక్ష్మీ దేవతకు దండం పెట్టుకోమని చెప్పాలి. తర్వాత వారి నుండి ఆశీర్వాదం తీసుకోవాలి.కొంతమంది మహిళలు రోజంతా కూడా ఉపవాసం ఉంటారు. మీ ఆరోగ్య సమస్యల దృష్ట్యా ఉపవాసము మీ ఇష్టప్రకారం ఉండవచ్చు.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం మత విశ్వాసాల ఆధారంగా పేర్కొనడం జరిగింది. జ్యోతిష్యం, జాతకం విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు.