ఎర్త్ అవర్ అనేది వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ (WWF)చే నిర్వహించబడే వార్షిక కార్యక్రమం. ఈ సంవత్సరం మార్చి 23న రాత్రి 8:30 గంటల నుండి 9:30 గంటల వరకు ఎర్త్ అవర్‌ను పాటించనున్నారు. ఎర్త్ అవర్ (Earth Hour 2024) సమయంలో, వ్యక్తులు, కమ్యూనిటీలు, వ్యాపారాలు గ్రహం పట్ల నిబద్ధతకు చిహ్నంగా, అనవసరమైన లైట్లు, ఎలక్ట్రికల్ ఉపకరణాలను ఒక గంట పాటు ఆఫ్ చేయమని ప్రోత్సహిస్తారు.
వాతావరణ మార్పులపై అవగాహన కల్పించడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని ఈ కార్యక్రమం లక్ష్యంగా పెట్టుకుంది. ఇది 2007లో ఆస్ట్రేలియాలోని సిడ్నీలో సింబాలిక్ లైట్స్-అవుట్ ఈవెంట్‌గా ప్రారంభమైంది. అప్పటి నుండి 190కి పైగా దేశాలు, భూభాగాలలో మిలియన్ల మంది ప్రజలను కలిగి ఉన్న ప్రపంచ ఉద్యమంగా ఎదిగింది. మార్చి 23న హైదరాబాద్‌లో ఈ ఐకానిక్ ప్రదేశాల్లో దీపాల వెలుగులు ఉండవు, ఎర్త్ అవర్ సందర్భంగా చీకటిలోకి జారుకోనున్న ప్రఖ్యాత కట్టడాలు
వాతావరణ మార్పుల నుండి మన భూమిని, ఈ ప్రపంచాన్ని రక్షించడానికి ఇప్పుడు సమిష్టిగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. వాతావరణ మార్పుల కారణంగా అనేక జాతులు విలుప్త అంచున ఉన్నాయి, హిమానీనదాలు కరుగుతున్నాయి, సముద్ర మట్టం నిరంతరం పెరుగుతోంది. దీనితో పాటు గ్లోబల్ వార్మింగ్ ప్రమాదంపై దేశాల ఆందోళన పెరుగుతోంది. ఇందులో మనం, మీరూ కలిసి ఈ భూమిని కాపాడేందుకు ఏదైనా చేస్తే ఎంత బాగుంటుంది. ఈ ఆలోచనతో సంవత్సరంలో ఒకరోజు ప్రపంచవ్యాప్తంగా 'ఎర్త్ అవర్' కార్యక్రమాన్ని నిర్వహిస్తారు, దీనిలో ప్రజలు తమ ఇంటి విద్యుత్‌ను ఒక గంట పాటు నిలిపివేయాలని విజ్ఞప్తి చేశారు.
ఎర్త్ అవర్‌ను 'లైట్స్ ఆఫ్' అని కూడా పిలుస్తారు, ఇది వాతావరణ మార్పుల ప్రభావాల నుండి గ్రహాన్ని రక్షించడానికి మద్దతుగా ప్రపంచవ్యాప్తంగా ప్రజలను ఏకం చేసే ప్రయత్నం మరియు ఇది మనం ఎదుర్కొంటున్న పర్యావరణ సమస్యలను గుర్తు చేస్తుంది. ఇలా కలిసి రావడం ద్వారా, మన గ్రహం యొక్క భవిష్యత్తును రక్షించుకోవడానికి మనం అత్యవసరంగా అవగాహన పెంచుకోవచ్చు. . రాత్రి 8.30 గంటలకు ఒక గంటసేపు లైట్లు ఆర్పమని పిలుపు ఇచ్చిన స్వచ్ఛంద సంస్థలు..ఎందుకు లైట్లు ఆర్పాలంటే..
ఎర్త్ అవర్‌లో పాల్గొనేందుకు కష్టపడాల్సిన అవసరం లేదు. చేయాల్సిందల్లా 23న రాత్రి 8.30 నుంచి గంటపాటు అంటే 9.30 వరకు అవసరం లేని లైట్లు, విద్యుత్ ఉపకరణాలను కట్టేయడమే. తద్వారా ఆ సమయాన్ని అద్భుతంగా వినియోగించుకునే అవకాశం కూడా లభిస్తుంది. ఆ గంటలో.. నక్షత్రాలను ఎంచక్కా వీక్షించవచ్చు. క్యాండిల్ లైట్ డిన్నర్ చేయొచ్చు. బయటకు వెళ్లి అలా ప్రకృతిని వీక్షిస్తూ ఆరుబయట తిరిగి రావొచ్చు.
సో.. మర్చిపోకండేం.. మీ క్యాలెండర్‌లో, సెల్‌ఫోన్‌లో, ఇంకా మీకు గుర్తొచ్చేలా మార్చి 23ను మార్క్ చేసుకోండి. భూతాపం పెరిగిపోకుండా మీరు కూడా ఓ చేయి వేయండి. భవిష్యత్ తరాల కోసం భూమిని పరిరక్షించండి.